ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు ఎలక్ట్రిక్ ఆటోలు , త్రిచక్ర వాహనాల అమ్మకాలు మరియు రిజిస్ట్రేషన్ లను బ్యాటరీలు లేకుండా అనుమతించాలని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర మరియు కేంద్ర రవాణా అధికారులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ లేదా త్రీ-వీలర్ యొక్క మొత్తం వ్యయంలో బ్యాటరీ ఖర్చు 30-40 శాతం వరకు ఉంటుంది కాబట్టి, ఈ చర్య ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో గణనీయమైన పురోగతికి దారితీస్తుంది.
విద్యుత్ వాహనాల కొనుగోలుదారులపై ప్రభుత్వ నిర్ణయంతో కొంత ఆర్థిక భారం తగ్గనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్ వాహనం యొక్క ధరను భారీగానే తగ్గించవచ్చు, తద్వారా అవి మరింత తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంటుంది . అయితే ఈ వాహనాల భద్రతకు సంబంధించి టెస్టింగ్ ఏజెన్సీ జారీచేసిన సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సర్టిఫికెట్ జారీ చేసిన ఏజెన్సీ వాహనంలో అమర్చే బ్యాటరీ, రెగ్యులర్ బ్యాటరీ నా ? లేక మార్చ దగిన శ్వాప్ బ్యాటరీనా అనే విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంటుంది.

హీరో ఎలక్ట్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజాల్ మాట్లాడుతూ, ఈ విధానం స్వాగతించదగిన చర్య అని పేర్కొన్నారు . దేశంలోని ప్రతి వ్యక్తికి ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడానికి దీంతో అవకాశం వస్తుందని అన్నారు . మనకు కావలసింది అటువంటి మార్గదర్శక విధానాల కలయిక అని ఆయన పేర్కొన్నారు . సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్, 1989 లోని రూల్ 126 ప్రకారం, అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు మరియు బ్యాటరీలను అవసరమైన ఏజెన్సీలు పరీక్షించాల్సిన అవసరం ఉంది మరియు టైప్ అప్రూవల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications