Electricity bills: కరెంటు బిల్లులు చెల్లించేందుకు గతంలో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. అప్పుడే ఏదైనా అర్జెంట్ పని పడితే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఆ బాధ్యతలు అప్పచెప్పాల్సిన అవసరం ఉండేది. అవికాస్తా వారి ఆర్థిక అవసరాలకు వినియోగించుకోవడం, వాటి గురించి గొడవలు పడటం పరిపాటే. ఆన్‌లైన్ పేమెంట్స్ ఎంట్రీతో ఈ తరహా ఇబ్బందులకు శుభం కార్డు పడింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, డిస్కమ్‌ల అభీష్టం మేరకు ఇటీవల ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్‌లో కరెంటు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో పలువురు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా డిస్కమ్‌ల అధికారిక వెబ్‌సైట్లలో పేమెంట్‌కు అవకాశం ఉన్నా, అంతగా యూజర్లను ఆకర్షించలేకపోయాయి. తద్వారా బిల్లుల చెల్లింపులు భారీగా పడిపోయాయి.

ఊహించని ఈ ఘటనతో అవాక్కయిన APCPDCL, TGSPDCLకు తత్వం బోధపడింది. అందుకే నెల తిరగకుండానే తమ నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్‌లలో కరెంటు బిల్లు చెల్లింపులకు లైన్ క్లియర్ చేశాయి. గతంలో మాదిరిగా వాటి ద్వారా పేమెంట్స్‌ను అంగీకరించేందుకు తమ సర్వీసులను పునరుద్ధరించాయి.
ఈ మేరకు ఉన్నతాధికారులు కీలక ప్రకటన చేశారు. ఇదే సమాచారాన్ని తమ అధికారిక సైట్లలో యూజర్లు అందరికీ కనిపించే విధంగా డిజైన్ చేశారు. దీంతో నెలరోజులుగా బిల్ పేమెంట్స్‌కు సంబంధించి ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. యూజర్లు కూడా తాముు పేమెంట్ చేయగలుగుతున్నట్లు నిర్ధారిస్తున్నారు.


Click it and Unblock the Notifications