Election Commission: దేశంలోని రాజకీయ పార్టీలు వివిధ మార్గాల్లో ఫండ్స్ సేకరిస్తుంటాయి. వాటిలో అతిముఖ్యమైనది ఎలక్టోరల్ బాండ్స్. తాజాగా వీటిని రద్దుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. దీనిపై ఎన్నికల సంఘం కూడా స్పందించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తాజాగా ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎలక్టోరల్ బాండ్లపై తమ వైఖరిని స్పష్టం చేశారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈవీఎంలు లేకుండా ఎన్నికలు నిర్వహించడంపైన మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా 'నిర్ణయం రానివ్వండి, కోర్టు ఆదేశాల మేరకు మార్పులు చేస్తాం' అని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను కొట్టివేసింది. ఇది రాజ్యాంగంలోని సమాచార హక్కు, వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. వీటి చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. రాజకీయ పార్టీలు అనామక డబ్బును స్వీకరించడానికి ఈ స్కీమ్ అనుమతించినట్లు అభిప్రాయపడింది. వీటి జారీని నిలిపివేయాలని బ్యాంకులను ఆదేశించింది.
దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న తన 29 శాఖల్లో SBI ఎలక్టోరల్ బాండ్లను జారీచేసేందుకు అధికారం కలిగి ఉంది. ప్రతి ఏడాది జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్‌లలో 10 రోజులపాటు వీటిని విక్రయిస్తుంది. అయితే ఏప్రిల్ 12, 2019 నుంచి కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘంతో పంచుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని న్యాయస్థానం కోరింది.
ఎలక్టోరల్ బాండ్ అనేది ప్రామిసరీ నోటు లాంటిది. ఇందులో చెల్లింపుదారుని పేరు సహా వివరాలు ఉంటాయి. కనీసం వెయ్యి నుంచి గరిష్ఠ పరిమితి లేకుండా ఎంతైనా చెల్లించవచ్చు. ఈ పథకం కింద, కార్పొరేట్లు మరియు విదేశీ సంస్థలు ఇచ్చే విరాళాలకు 100 శాతం పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే పార్టీల గురించి ఎటువంటి సమాచారం ఈ బాండ్లలో ఉండదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే వీటి గురించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications