Multibagger Stock: ఫుల్ జోష్ లో ఉన్న ఎనర్జీ స్టాక్.. లక్ష పెట్టుబడిని రూ.26 లక్షలుగా చేసింది..
Multibagger Stock: ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం ఒత్తిడితో సంబంధం లేకుండా, భారతీయ ఈక్విటీ మార్కెట్ ఇటీవలి కాలంలో అనేక రకాల మల్టీబ్యాగర్ షేర్లను అందించగలిగింది. ఈ క్రమంలో కొన్ని కంపెనీల షేర్లు మాత్రం రాకెట్ లాగా పైకి ఎగబాకుతూ ఇన్వెస్టర్లకు ఊహించని స్థాయిలో లాభాలను అందిస్తున్నాయి. ఇప్పుడు EKI ఎనర్జీ సర్వీసెస్ కంపెనీ షేర్ కూడా ఈ మల్టీబ్యాగర్ల జాబితాలోకి చేరిపోయింది. ఈ BSE లిస్టెడ్ స్టాక్ గడచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో పెరుగుతూనే ఉంది. ఈ కాలంలో షేర్ విలువ దాదాపు 50 శాతానికి పైగా పెరిగి నిఫ్టీ, సెన్సెక్స్ సూచీల కంటే మంచి రాబడులను అందించిది.

EKI వైటాలిటీ షేర్ ధర చరిత్ర..
చివరి 5 సెషన్స్ లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ రెండు రోజుల పాటు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఏదేమైనప్పటికీ.. చివరి 12 నెలల్లో EKI ఎనర్జీ సర్వీసెస్ ఒక్కో షేరు ధర రూ.190 రేంజ్‌ల నుంచి రూ.2,630 వరకు పెరిగింది. ఈ సమయంలో షేరు దాదాపు 1360 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ స్టాక్ గడచిన 15 నెలల్లో దాని ఇన్వెస్టర్లకు 6,725 శాతం రాబడిని అందించింది.

పెట్టుబడులపై రాబడి ఇలా..
ఒక ఇన్వెస్టర్ ఈ BSE-లిస్టెడ్ స్టాక్ లో వారం క్రితం లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుతం దాని విలువ రూ.1.50 లక్షలు అయి ఉండేది. అదే ఒక నెల కిందట ఈ స్టాక్ లో లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం రూ.1.55 లక్షలకు చేరేది. ఏడాది క్రితం ఈ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన వారికి ప్రస్తుతం రూ.14.60 లక్షలు అయి ఉండేది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు మల్టీబ్యాగర్ రాబడులను పొందారు.

షేర్ పబ్లిక్ ఇష్యూ..
EKI ఎనర్జీ సర్వీసెస్ షేర్ పబ్లిక్ ఇష్యూ ఏప్రిల్ 2021లో.. రూ.100 నుంచి రూ.102 బ్యాండ్ ప్రైస్ మధ్య మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ సమయంలో షేర్లు ఎలాట్ అయిన వారికి దాదాపు 40 శాతం లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి. అంటే రూ.100 ఒక్కో షేరు విలువ రూ.140కి చేరటంతో ఆరంభంలోనే మంచి రిటర్స్న్ అందాయి. అప్పటి నుంచి ఈ షేర్లలో పెట్టుబడిని కొనసాగించిన వారికి.. 15 నెలల కాలంలో 2475 శాతం రాబడులు వచ్చాయి.
EKI ఎనర్జీ సర్వీసెస్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7,093 కోట్లుగా ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో షేర్ 5 శాతం లోయర్ సర్కూట్ తాకటంతో రూ.2,615.70 వద్ద ట్రేడ్ అవుతోంది. EKI ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ షేర్ 52 వారాల కనిష్ఠ ధర రూ.189.68 వద్ద ఉండగా, దాని 52 వారాల గరిష్ఠ ధర రూ.3,150 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications