ముంబై: గతవారం టాప్ 10 కంపెనీల్లోని ఎనిమిది సంస్థలు మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా కోల్పోయాయి. వారాంతంలో మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,11.799.05 కోట్ల మేర నష్టపోయింది. ఇందులో ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువగా నష్టపోయాయి. సెన్సెక్స్ గతవారం 3 శాతం, నిఫ్టీ 3 శాతం మేర నష్టపోయింది. ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 4 మధ్య ఐదు సెషన్లలో సెన్సెక్స్ 1,110 పాయింట్లు నష్టపోయింది. మే 18వ తేదీ తర్వాత ఇది అతిపెద్ద పతనం. అప్పుడు 1,068 పాయింట్లు లేదా 3.4 శాతం మేర నష్టపోయింది.

రూ.10వేల కోట్లకు పైగా సంపద డౌన్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), HDFC బ్యాంకుల మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే గతవారం పెరిగింది. మిగతా ఎనిమిది కంపెనీలు నష్టాల్లో ముగిశాయి.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.25,476.75 కోట్లు నష్టపోయి రూ.2,57,073.30,
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.24,216.53 కోట్లు కోల్పోయి రూ.13,16,947.89,
హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాప్ రూ.20,150.82 కోట్లు క్షీణించి రూ.3,17,321.63 కోట్లుగా,
కొటక్ మహీంద్రా మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,642.8 కోట్లు తగ్గి రూ.2,72,815.29,
ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.10,951.21 తగ్గి రూ.2,29,667.79 కోట్లుగా ఉంది. ఈ ఐదు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.10వేల కోట్ల నుండి రూ.25వేల కోట్లకు పైగా తగ్గింది.

రూ.1.11 లక్షల మార్కెట్ క్యాప్ తగ్గింది
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.6,643.75 కోట్లు క్షీణించి రూ.3,91,544.91 కోట్లుగా,
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,471.69 కోట్లు తగ్గి రూ.4,99,186.72 కోట్లు,
భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ వ్యాల్యూ రూ.245.5 కోట్లు తగ్గి రూ.2,85,380.21 కోట్లుగా నిలిచంది.
ఈ ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.11 లక్షల కోట్లు తగ్గింది.

ఇవి మాత్రమే దూకుడు
గతవారం కేవలం రెండు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే పెరిగింది. ఇందులో ఐటీ దిగ్గజం టీసీఎస్, ప్రయివేటురంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.
టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.19,756.31 కోట్లు పెరిగి రూ.8,59,202.29కు, HDFC బ్యాంకు ఎం-క్యాప్ రూ.2,641.5 కోట్లు పెరిగి రూ.6,16,240.17 కోట్లకు పెరిగింది.
టాప్ 10 కంపెనీల విషయానికి వస్తే వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ITC ఉన్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications