టాప్ టెన్లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2,61,812.14 కోట్లు తగ్గింది. అంతకుముందువారం టాప్ టెన్లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,28,367.09 పెరిగింది. అంతకుముందు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ వరుసగా రెండుసార్లు పెరిగింది. అంతకంటే ముందు వరుసగా రెండువారాలు మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఒమిక్రాన్ ప్రభావం అంతంతే అనే అభిప్రాయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటు అంతకుముందు రెండువారాలు బలపడింది. కానీ ఒమిక్రాన్ భయాలు, ద్రవ్యోల్భణ ఆందోళనల కారణంగా గతవారం క్షీణించాయి. క్రితం వారం బీఎస్ఈ బెంచ్ మార్క్ 1,774.93 పాయింట్లు లేదా 3.01 శాతంనష్టపోయింది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.79,658.02 కోట్లు తగ్గి రూ.15,83,118.61 కోట్లకు తగ్గింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.34,690.09 కోట్లు తగ్గి రూ.4,73,922.86 కోట్లకు తగ్గింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.33,152.42 కోట్లు తగ్గి రూ.4,16,594.78 కోట్లుగా నమోదయింది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.27,298.3 తగ్గి రూ.8,16,229.89 కోట్లకు తగ్గింది.
- హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,083.31 కోట్లు క్షీణించి రూ.5,24,052.84 కోట్లకు తగ్గింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,051.83 కోట్లు క్షీణించి రూ.4,17,448.70 కోట్లకు తగ్గింది.
- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.20,623.35 కోట్లు తగ్గి రూ.5,05,547.14 కోట్లకు పడిపోయింది.
- టాటా కన్సల్టెన్సీ మార్కెట్ క్యాప్ రూ.18,254.82 కోట్లు క్షీణించి రూ.13,26,923.71 కోట్లుగా నమోదయింది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
- అదే సమయంలో ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.26,515.92 కోట్లు లాభపడి రూ.7,66,123.04 కోట్ల వద్దకు చేరుకుంది.
- విప్రో మార్కెట్ క్యాప్ రూ.17,450.39 కోట్లు పెరిగి రూ.3,67,126.39 కోట్లకు ఎగిసింది.

టాప్ టెన్ కంపెనీలు..
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications