టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్పోసిస్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఎక్కువగా పెరిగింది. అంతకుముందు వారం టాప్ టెన్‌లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1 లక్ష కోట్లకు పైగా క్షీణించింది. అప్పుడు కేవలం టీసీఎస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC బ్యాంకుల మార్కెట్ క్యాప్ పెరిగింది. మిగతా సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణించింది. గతవారం కూడా టీసీఎస్ మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.36,158.22 కోట్లు పెరిగి రూ.11,71,082.67 కోట్లకు చేరుకుంది. టాప్ టెన్‌లోని కంపెనీల్లో టీసీఎస్ ఎక్కువగా లాభపడింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.20,877.24 కోట్లు ఎగిసి రూ.5,90,229.35 కోట్లకు చేరుకుంది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.19,842.83 కోట్లు పెరిగి రూ.5,63,767.05 కోట్లుగా నమోదయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.17,401.77 కోట్లు ఎగిసి రూ.12,81,644.97 కోట్లుగా ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎం-క్యాప్ రూ.12,003.6 కోట్లు ఎగిసి రూ.3,30,701.48 కోట్లుగా నమోదయింది.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.10,681.76 మార్కెట్ క్యాప్ రూ.4,10,775.37 కోట్లుగా ఉంది.
కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.6,301.56 కోట్లు ఎగిసి రూ.3,57,573.74 కోట్లుగా నమోదయింది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,236.49 కోట్లు పెరిగి రూ.3,17,563.53 కోట్లుగా ఉంది.

HDFC డౌన్
HDFC బ్యాంకు, HDFC మార్కెట్ క్యాప్ మాత్రం క్షీణించింది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.3,142.29 కోట్లు క్షీణించి రూ.8,19,474.22 కోట్లుగా నమోదయింది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.171.38 కోట్లు ఎగిసి రూ.4,56,569.82 కోట్లుగా నమోదయింది.

టాప్ టెన్ వరుసగా
గతవారం హాలీడేస్ వచ్చాయి. గత వారంలో సోమవారం, శుక్రవారం మార్కెట్లు బంద్ ఉన్నాయి. మూడు రోజులు మాత్రమే వర్క్ చేశాయి. ఈ మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,021.33 పాయింట్లు లేదా 2 శాతం లాభపడింది. టాప్ 10 కంపెనీలు వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీ లీవర్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications