కరోనా మహమ్మారి కారణంగా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ వైరస్ ప్రభావం తగ్గుతుందనే సంకేతాలు ఉన్నప్పుడల్లా కాస్త కోలుకుంటున్నాయి. గత వారం కరోనా వల్ల మన దేశంలోని టాప్ 10 కంపెనీల్లోని 8 కంపెనీల ఆస్తులు పెద్ద ఎత్తున కరిగిపోయాయి. చమురు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిలయన్స్ ఎక్కువగా నష్టపోయింది. గత వారం 8 కంపెనీల మార్కెట్ వ్యాల్యూ ఏకంగా రూ.1,37,311.31 కోట్ల మేర తగ్గింది.

ఈ రెండు మాత్రమే లాభపడ్డాయి
గత వారంలో లాభపడిన కంపెనీల్లో కేవలం భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ మాత్రమే ఉన్నాయి. మిగతా ఎనిమిది కంపెనీల ఆస్తులు తగ్గిపోయాయి. భారతీ ఎయిర్ టెల్ ఆస్తులు గత వారం 13,147.89 జత కలిసి కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ.3,02,292.43 కోట్లుగా నిలిచింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.7,744.11 పెరిగి రూ.2,02,330.13 కోట్లకు పెరిగింది.

ఏ కంపెనీ ఆస్తి ఎంత తరిగింది.. ఎం-క్యాప్ ఎంత
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆస్తులు రూ.65,232.46 కోట్ల మేర కరిగిపోయి కంపెనీ ఎం-క్యాప్ రూ.9,24,855.56గా నిలిచింది. HDFC బ్యాంకు సంపద రూ.22,347.07 కోట్లు కరిగిపోయి రూ.4,87,083.88 కోట్లుగా, హిందూస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ సంపద రూ.13,192.26 కోట్లు కరిగిపోయి రూ.4,77,458.89 కోట్లుగా, ICICI బ్యాంకు సంపద రూ.9,770.06 కోట్లు తగ్గి రూ.2,08,900.79 కోట్లుగా, ఇన్ఫోసిస్ ఆస్తులు రూ.9,518.84 తగ్గి రూ.2,77,814.09 కోట్లుగా, HDFC ఆస్తులు రూ.9,370.38 తగ్గి రూ.2,83,293.70 కోట్లుగా ఉంది. కొటక్ మహీంద్రా బ్యాంకు సంపద రూ.7,805.2 కోట్లు తగ్గి ఎం-క్యాప్ రూ.2,25,327.22 కోట్లుగా ఉంది.

రిలయన్స్ టాప్
టాప్ 10 కంపెనీల్లో ర్యాంకింగ్స్ విషయానికి వస్తే... అత్యధిక ఎం-క్యాప్ కలిగిన సంస్థగా రిలయన్స్ స్థానం నిలుపుకుంది. ఆ తర్వాత టీసీఎస్, HDFC బ్యాంకు, ఎయిర్ టెల్, HDFC, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐసీఐసీఐ, ఐటీసీ ఉన్నాయి. గత వారంలో సెన్సెక్స్ 545 పాయింట్ల మేర నష్టపోయింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications