గతవారం మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగడం, ఆసియా మార్కెట్లు కూడా అదే పంథాలో ఉండటం, చమురు ధరలు క్రమంగా పెరుగుతుండటం వంటి వివిధ కారణాలతో గత ఐదు సెషన్‌లలో ఎగుడుదిగుడులు చూసినప్పటికీ మొత్తానికి చివరికి లాభాల్లో ముగిశాయి. టాప్ 10 మోస్ట్ వ్యాల్యూ కలిగిన ఇండియన్ కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది.

రూ.11 లక్షల కోట్లు దాటిన రిలయన్స్ ఎం-క్యాప్
పది కంపెనీల్లో ఎనిమిది కంపెనీలు భారీ లాభాలు నమోదు చేసి గత వారం రూ.1,76,489.28 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను యాడ్ చేశాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 950.85 పాయింట్లు లేదా 2.81 శాతం ఎగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ షేర్ ఐదు సెషన్‌లలో రూ.1,08,213.62 కోట్లు ఎగిసి ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ.11,15,418.03 కోట్లకు చేరుకుంది. ఈ మార్క్ చేరుకున్న తొలి ఇండియన్ కంపెనీ రిలయన్స్ కావడం గమనార్హం.

వీటి మార్కెట్ వ్యాల్యూ ఎంత పెరిగిందంటే
ఇతర పెద్ద కంపెనీల విషయానికి వస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ వ్యాల్యూ రూ.27,788.22 పెరిగి రూ.5,67,093.60 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.12,729.16 పెరిగి రూ.2,35,648.10 కోట్లకు, హెచ్‌డీఎప్‌సీ రూ.8,110.36 పెరిగి రూ.3,18,597.21 కోట్లకు, భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ.6,301.17 పెరిగి రూ.3,11,757.83 కోట్లకు చేరుకుంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ వ్యాల్యూ రూ.5,771.09 పెరిగి రూ.3,00,543.95 కోట్లకు చేరుకుంది.

టీసీఎస్, కొటక్ జూమ్, ఐటీసీ-హెచ్‌యూఎల్ డౌన్
కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,442.42 కోట్లు పెరిగి రూ.2,57,640.33 కోట్లకు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎం-క్యాప్ రూ.3,133.24 కోట్లు పెరిగి రూ.7,68,131.91 కోట్లకు చేరుకుంది.
ఇక, ఐటీసీ వ్యాల్యూయేషన్ రూ.12,169.31 కోట్లు క్షీణించి రూ.2,26,299.98 కోట్లకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,277.62 కోట్లు క్షీణించి రూ.4,91,584.61 కోట్లకు తగ్గింది.
మార్కెట్ క్యాప్ పరంగా టాప్ టెన్ కంపెనీలు వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎప్‌సీ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications