Multibagger Stock: స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ రాబడులు ఎవరైనా పొందొచ్చు. ఇందుకు కావాల్సిందల్లా మార్కెట్ల గురించి తెలుసుకోవటం, సరైన కంపెనీలను ఎంపిక చేసుకోవటానికి ముందు రీసెర్చ్ చేయటం. ఆ తర్వాత అన్నింటి కంటే ఎక్కువ ఓర్పు అవసరం.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది మల్టీబ్యాగర్ రాబడులను ఇన్వెస్టర్లకు ఐషర్ మోటార్స్ అందించింది. దేశంలో యువత ఎక్కువగా ఇష్టపడే బుల్లెట్ మోటార్ సైకిళ్లను ఈ సంస్థే తయారు చేస్తోంది. దీర్ఘకాలంలో కంపెనీ షేర్లు 53000% కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఒకప్పుడు రూ.7 వద్ద ఉన్న ఒక్కో షేర్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.3700కి పెరిగింది. స్టాక్ 52 వారాల గరిష్ఠమైన రూ.3,886ని చేరుకోగా.. అదే సమయంలో షేర్ 52 వారాల కనిష్ఠ ధర రూ.2,585.30గా ఉంది.

2022 జూన్ 26న బీఎస్ఈలో కంపెనీ ఒక్కో షేర్ ధర రూ.6.99 వద్ద ఉంది. ఆ సమయంలో ఎవరైనా ఇన్వెస్టర్ లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారు దాదాపు రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందేవారు. నేటి మార్కెట్ రేటు ప్రకారం వారి పెట్టుబడి విలువ రూ.5.30 కోట్లుగా ఉండేది. ఈరోజు మార్కెట్లు ముగిసే సమయానికి కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ.3,714 వద్ద ట్రేడింగ్ ముగించింది.
15 ఏళ్ల కాలంలో షేర్లు మంచి బూమ్ చూశాయి. 6 జూన్ 2008న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE)లో కంపెనీ షేర్లు రూ.27.51 వద్ద ట్రేడవుతున్నాయి. ఐషర్ మోటార్స్ షేర్లు జూన్ 7, 2023న BSEలో రూ.3714.35 వద్ద ట్రేడవుతున్నాయి. 15 ఏళ్ల క్రితం ఐషర్ మోటార్స్ షేర్లలో ఒక వ్యక్తి రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి వాటిని విక్రయించకుండా ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే.. దాని విలువ ప్రస్తుతం రూ.1.35 కోట్లకు పైగా ఉండేది. ఐషర్ మోటార్స్ షేర్లు గత 10 ఏళ్లలో 945% కంటే ఎక్కువ లాభపడ్డాయి.

Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications