గుడ్ల ధర రోజురోజుకి పెరిగి పోతుండటంతో ఎవరైనా కోళ్లను పెంచుకోవడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది... ఆశ్చర్యంగా ఉంటుంది కదా.. ఈ రోజుల్లో అమెరికాలో ఇలాంటిదే జరుగుతోంది. ఇక్కడ గత రెండు నెలలుగా పెరుగుతున్న గుడ్ల ధర ఇంకా సప్లయ్ తగ్గడం సూపర్ మార్కెట్ల సమస్యలను పెంచింది. అమెరికా ప్రజల అల్పాహారంలో గుడ్లు ఒక ముఖ్యమైన భాగం, కానీ సప్లయ్ తక్కువగా ఉండటం వల్ల వాటి ధరలు మండిపోతున్నాయి. దింతో ఈ సమస్యలకి చెక్ పెట్టడానికి అక్కడి ప్రజలు కోళ్లను అద్దెకు తీసుకోవడం ప్రారంభించారు. అంతేకాదు అమెరికాలో పెరుగుతున్న ఈ ట్రెండ్'కి 'రెంట్-ఎ-హెన్' అని పేరు కూడా పెట్టారు.

గుడ్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే: గుడ్ల ధరలు పెరగడానికి కారణం బర్డ్ ఫ్లూ. ఈ వ్యాధి కారణంగా లక్షలాది గుడ్లు పెట్టే కోళ్లను చంపాల్సి వచ్చింది. ఫలితంగా గుడ్ల సప్లయ్ తగ్గి ధర పెరిగింది. మార్చి 2025లో గుడ్ల ధర గత సంవత్సరం కంటే 60 శాతం పెరిగింది. దింతో 12 గుడ్ల ధర $10కి చేరింది. ఇది సాధారణ ధర కంటే మూడు రెట్లు ఎక్కువ. అంతేకాక సూపర్ మార్కెట్లు ఒక కస్టమర్ కొనే గుడ్ల సంఖ్యపై పరిమితిని విధించాయి.
రెంట్-ఎ-హాన్ అంటే ఏమిటి: 'రెంట్-ఎ-హెన్' అనేది ప్రజలు కోళ్లను అద్దెకు తీసుకునే సర్వీస్. ఈ ట్రెండ్ దాదాపు 10 సంవత్సరాల క్రితం పెన్సిల్వేనియాలో ఒక రైతు దంపతులు 'రెంట్ ది చికెన్' అనే కంపెనీని స్థాపించినప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సర్వీస్ ఉత్తర అమెరికాలోని 40కి పైగా నగరాల్లో అందుబాటులో ఉంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో దీనికి డిమాండ్ పెరిగింది. బర్డ్ ఫ్లూ కారణంగా మళ్ళీ ప్రజలలో ప్రాచుర్యం పొందుతోంది. "ఈ సంవత్సరం, మా సేవలపై ఆసక్తి చూపే వారి సంఖ్య మూడు నుండి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది" అని లాస్ ఏంజిల్స్ సమీపంలోని అగువా డుల్స్‌లో వ్యవసాయం చేసే విక్టోరియా లీ తెలిపింది. ఇది చాలా సులభం కాబట్టి ప్రజలు దీన్ని చాలా ఇష్టపడుతున్నారు.
రెంట్-ఎ-హాన్ ఎలా పని చేస్తుంది: ఈ సర్వీస్ ద్వారా మీరు కోళ్లు, వాటికి ఆహారం, నీటి గిన్నె, ఒక చిన్న ఇల్లు (గూడు) పొందుతారు. ఈ గుడికి చక్రాలు ఉంటాయి కాబట్టి దీనిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా మార్చవచ్చు. అయితే ఆరు నెలల అద్దె $500 నుండి $1,000 వరకు ఉంటుంది. ఈ అద్దె ధర స్థలం ఇంకా కోళ్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
ఈ పద్ధతిని ఎందుకు ఇష్టపడుతున్నారంటే : అమెరికాలో ప్రజలు అల్పాహారం కోసం గుడ్లు తినడానికి ఇష్టపడతారు. ఈ కారణంగా చాలా మంది తాజా గుడ్లు కొంటుంటారు. అందుకే ఇప్పుడు ఈ సర్వీస్ ఇష్టపడుతున్నారు. ఈ పద్ధతి సరదాగా ఇంకా సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ నిపుణులు సూపర్ మార్కెట్ నుండి గుడ్లు కొనడానికి సంవత్సరానికి దాదాపు $300 ఖర్చవుతుంది, కానీ కోళ్ల పెంపకం దాని కంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications