కరోనా మహమ్మారి నేపథ్యంలో కోడిగుడ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఓ వైపు గుడ్ల ఉత్పత్తి తగ్గగా, మరోవైపు గుడ్లకు డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో రూ.6, మరికొన్ని ప్రాంతాల్లో రూ.7గా ఉంది. గత జనవరి-ఫిబ్రవరిలో బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తుందనే ప్రచారంతో గుడ్ల వినియోగం భారీగా తగ్గింది. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రోగ నిరోధకత పెంచుకునేందుకు గుడ్ల వినియోగం భారీగా పెరిగింది.
లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు, కార్మికుల కొరత వల్ల సరఫరా ఇబ్బందులు ఉండటంతో ప్రస్తుత సమయంలో డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో కోళ్ల దాణా వ్యయాలు పెరిగిపోవడంతో గుడ్ల రిటైల్ ఆకాశాన్నంటాయి. కరోనా రోగులకు అధికంగా ప్రొటీన్లు లభించే ఆహారం అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు. తక్కువ ధరలో ప్రొటీన్లు అందేందుకు గుడ్లు సులభ మార్గమని డాక్టర్లు సూచిస్తున్నారు.

గుడ్లలో అత్యధికంగా 11 శాతం ప్రొటీన్ కంటెంట్ ఉంటుందని చెబుతున్నారు. దీంతో గుడ్ల వినియోగం పెరిగింది. 2018-19లో ఒక వ్యక్తి సగటున వార్షిక గుడ్ల వినియోగం 79 కాగా, 2019-20కి 86కు చేరుకుంది. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా కోళ్ళ పరిశ్రమ దెబ్బతిన్నది. దీంతో అప్పుడు చికెన్, గుడ్లకు డిమాండ్ తగ్గింది.
అయితే జూన్-డిసెంబర్ కాలంలో గుడ్ల డిమాండ్ పుంజుకుంది. గత ఏడాది జూన్ నెలలో ఒక వ్యక్తి నెలవారీ గుడ్ల వినియోగం 7 కాగా, ఈ ఏడాది జనవరి - ఫిబ్రవరి కాలంలో 4కు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ ఏడుకు చేరుకుంది.


Click it and Unblock the Notifications