IPO News: కొత్త ఏడాది మార్కెట్లోకి మరో సూపర్ ఐపీవో.. డబ్బు సిద్ధం చేస్కోండి మిత్రులారా..

Credila Financial IPO: మరో రెండు రోజుల్లో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ క్రమంలో భారతీయ స్టాక్ మార్కెట్లు కొత్త ప్రయాణానికి సిద్ధం అవుతున్నాయి. దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లు సైతం 2025లో సరికొత్త లాభాల ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. అలాగే ఐపీవోల మార్కెట్లో రద్దీ కూడా కొత్త ఏడాది అదే స్థాయిలో కొనసాగనుందని తెలుస్తోంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి కంపెనీ విద్యార్థులకు రుణాలను అందించే వ్యాపారంలో ఉంది. గతంలో కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్ అని పిలువబడేది. కంపెనీ తన మూలధన అవసరాల కోసం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చేందుకు ఇప్పటికే మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. దీంతో ఇప్పుడు ఇన్వెస్టర్ల కన్ను ఈ ఐపీవోపైనే కొవసాగుతోంది. ఎడ్యుకేషన్ లోన్ వ్యాపారంలో ఉన్న కంపెనీ షేర్‌హోల్డర్‌లు డిసెంబర్ 26న జరిగిన అసాధారణ సాధారణ సమావేశంలో ఐపీవో ద్వారా నిధుల సమీకరణను ఏకగ్రీవంగా ఆమోదం తెలపటంతో కంపెనీ ముందుకు సాగాలని నిర్ణయించింది.

Education loan company Credila Financial files papers with SEBI to float IPO Know details

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ ఐపీవో ఏకకాలంలో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో లిస్టింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కంపెనీ జూన్ 2023లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలాను.. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ నుంచి స్వీడిష్ పెట్టుబడి దిగ్గజం ఇక్యూటి, దేశీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ క్రిస్ క్యాపిటల్ కన్సార్టియం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ గత ఏడాది విద్యా రుణాల రూపంలో రూ.7,992 కోట్లను పంపిణీ చేయగా.. ప్రస్తుతం 2024 ఆర్థిక సంవత్సరంలో అవి 76 శాతం పెరుగుదలతో రూ.17,089 కోట్లకు చేరుకున్నాయి. ఈ క్రమంలో కంపెనీ ఆర్థిక సంవత్సరంలో 53,603 మంది విద్యార్థులకు రుణాల పంపిణీ నిర్వహించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దాని రుణాలు 84 శాతం పెరిగి రూ.28,187 కోట్లకు చేరుకున్నాయి. అలాగే రుణాలపై వడ్డీ ఆదాయం అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 95 శాతం పెరిగి రూ.2,535 కోట్లకు చేరుకున్నాయని కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం వెల్లడైంది.

2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 92 శాతం పెరిగి రూ.528.84 కోట్లుగా నమోదైంది. రుణాల పంపిణీలో నమోదైన వృద్ధి కారణంగా కంపెనీ నికర వడ్డీ ఆదాయం కూడా ఈ మేరకు 79 శాతం పెరుగుదలను చూసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.226.5 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.136.7 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీవో మార్కెట్లోకి వస్తున్న వేళ చాలా మంది పెట్టుబడిదారులు దీనిపై బెట్టింగ్ వేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా మంచి రాబడి కోసం ఐపీవోలో పాల్గొనేందుకు డబ్బును సిద్ధం చేసుకుంటున్నారు.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+