Byju's Aakash: దేశంలోని ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ ఆఫ్‌లైన్ కోచింగ్ సబ్సిడరీ ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. దేశంలో అనేక నగరాల్లో ఆకాష్ కు కార్యాలయాలు ఉన్నాయి.
అయితే ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ IPOను 2024లో తీసుకురావాలని బైజూస్ చూస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న బైజూస్ వచ్చే ఏడాది మధ్య నాటికి ఆకాష్ ఐపీవో కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులను ఆకాష్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, దాని పరిధిని విస్తృతం చేయడానికి అవసరమైన మూలధనాన్ని అందిస్తుందని కంపెనీ భావిస్తోంది.

స్టార్టప్ బైజుస్ ఏప్రిల్ 2021లో సుమారు 950 మిలియన్ డాలర్లను వెచ్చింది ఆకాష్‌ను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి సంస్థ ఆదాయం మూడు రెట్లు పెరిగింది. FY24లో రూ.900 కోట్ల నికర లాభంతో పాటు రూ.4000 కోట్ల ఆదాయాన్ని చేరుకోవటానికి ప్రయత్నిస్తోంది. కరోనా సమయంలో స్కూల్స్ మూతబడటంతో ఊపందుకున్న ఆన్ లైన్ విద్య.. ఆ తర్వాత విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోవటంతో ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది. దీంతో కంపెనీలకు నష్టాలు భారీగా పెరిగాయి.
ఆకాష్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 325 కేంద్రాల ద్వారా దాదాపు 4 లక్షల మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులకు సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఇది బైజూస్ కు విలువైన ఆస్థిగా మారింది. టెస్ట్-ప్రిప్ ఎడ్యుకేషన్ సెక్టార్‌లో ఆకాష్ 30 ఏళ్లకు పైగా అనుభవాన్ని కలిగి ఉంది. ఫండింగ్ కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో ఆకాష్ ఐపీవో బైజూస్ కు చాలా కీలకంగా మారనుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications