Byjus Salary: భారత స్టార్టప్ కంపెనీల్లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీలుగా గుర్తింపు తెచ్చుకున్న సంస్థలు సైతం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. సీఈవో రాజీనామా చేసిన తర్వాత ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.
అవును బైజూస్ సంస్థ గత కొన్ని నెలలుగా సమయానికి ఉద్యోగులకు వేతనాలు చెల్లించటంలో సైతం విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టార్టప్ యాజమాన్యం కొత్త ఆలోచనలతో ముందుకొచ్చింది. కంపెనీని తిరిగి గాడినపెట్టే క్రమంలో ఉద్యోగులకు వేతన నిర్మాణాన్ని సవరించింది. కరోనా సమయంలో ఒక వెలుగు వెలిగిన స్టార్టప్ విచ్చలవిడిగా విస్తరణకు, బ్రాండింగ్ కోసం డబ్బును ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇన్వెస్టర్లతో కొనసాగుతున్న చట్టపరమైన వివాదాలు కంపెనీకి నిధుల కొరతను కల్పించాయి. దీంతో గత కొన్ని నెలలుగా బైజూస్ ఆర్థిక ఆరోగ్యం బాగా క్షీణించింది.

దీంతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గత జనవరి నుంచి బైజూస్ తన ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వలేదు. కొన్ని నెలల కిందట వ్యవస్థాపకుడు బైజూ రవీంథ్రన్ ఏకంగా తన ఇంటిని సైతం జీతాల చెల్లింపుల కోసం తాకట్టుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానంలో బైజూస్ కంపెనీ పెద్ద మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం కంపెనీ సేల్స్ డిపార్ట్‌మెంట్, ఎగ్జామ్ ప్రిపరేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగులకు రెవెన్యూ లింక్డ్ శాలరీ ప్రవేశపెట్టబడింది. అంటే వారంవారీ సంపాదన ఆధారంగా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని కంపెనీ చెప్పింది.
కంపెనీ తీసుకొచ్చిన కొత్త వేతన పాలసీ ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వచ్చినట్లు సమాచారం. ఇకపై సేల్స్ ప్రతినిధుల ఆదాయం ఆ వారంలో వారు చూపించే సేల్స్ రేటు ప్రకారం ఉంటుంది. అంటే వీక్లీ సేల్స్ రేటులో 50% చొప్పున జీతం చెల్లిస్తామని, ఈ జీతం వారానికోసారి చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఉద్యోగులకు బైజూస్ ప్రాథమిక వేతనాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. వారంవారీ సంపాదన ఆధారంగా జీతం చెల్లించనున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరణ ఇచ్చింది. అంటే ఈ వారంలో ఎలాంటి సేల్స్ రాని ఉద్యోగులకు జీతం కూడా లభించదని బైజూస్ తెలిపింది.
కొత్త పే స్కేల్ ఒక వ్యక్తి కంపెనీకి ఆదాయాన్ని ఎలా తెస్తున్నారు. జట్టులో ఆ వ్యక్తి స్థానం ఏమిటి. ప్రతి బృందంలోని సేల్స్ ప్రతినిధుల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడుతుంది. కంపెనీ వేతన పాలసీని వారానికోసారి చెల్లింపులోకి తీసుకురావటం వల్ల.. నెలవారీ జీతంపై తమకు లభించిన ఇతర ప్రయోజనాలను పొందలేక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పనితీరు ఆధారిత ఆదాయం తమపై మరింత ఒత్తిడి తెస్తోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications