Byju's News: సంక్షోభంలో బైజూస్..! ఉద్యోగాలకు ఇంకా అందని జీతాలు..
Byju's Salaries: రోజులు గడుస్తున్న కొద్ది బైజూస్ సంస్థ మరిన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఒక సమస్య పరిష్కారమైందనుకునే లోపే మరో సమస్య కంపెనీని వచ్చి చుట్టుకుంటోంది.
దీంతో ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం, డొల్లతనం క్రమంగా బయటపడుతోంది. మెున్నటి వరకు రుణాల చెల్లింపులు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొన్న కంపెనీ తాజాగా.. ఉద్యోగుల జీతాలను ఆలస్యం చేస్తోంది. జీతాలకు డబ్బులు లేవా లేక ఇతర కారణాలు ఉన్నాయా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం స్టార్టప్ కంపెనీ తన ఉద్యోగులకు ఇంకా నవంబర్ జీతాలను విడుదల చేయలేదని వెల్లడైంది. దీంతో దాదాపు 1000 మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. పెండింగ్ లో ఉన్న జీతాల చెల్లింపులను సోమవారం ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని బైజూస్ స్పష్టం చేసింది.

బైజుకు దేశంలో దాదాపు 14,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. జీతంతో ప్రభావితమైన ఉద్యోగులు బైజు మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ కిందకు వస్తారు. సాధారణంగా బైజు జీతం ప్రతి నెల 1న చెల్లిస్తుంటుంది. అయితే ఈ సారి అలా జరగలేదని కంపెనీ ఉద్యోగులు ధృవీకరించారు. సాంకేతిక లోపం కారణంగా పరిమిత సంఖ్యలో ఉద్యోగులకు(5%) జీతం ప్రాసెసింగ్‌లో జాప్యం జరిగిందని బైజూ ప్రతినిధి పేర్కొన్నారు. సోమవారం ఇది పరిష్కారమవుతుందని వెల్లడించారు.
ర్యాపిడ్ వ్యాపార విస్తరణకు వెళ్లి బైజూస్ విపరీతంగా మార్కెటింగ్ ఖర్చులు చేసింది. అయితే ప్రస్తుతం ఫండింగ్ వింటర్ నడుస్తున్న క్రమంలో అవసరాలకు నిధులను సేకరించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. కంపెనీలోని అగ్ర పెట్టుబడిదారులు కొత్త మూలధనాన్ని నింపడానికి కొన్ని షరతులు విధించారు. ప్రస్తుతం కంపెనీ 120-130 మిలియన్ డాలర్ల పెట్టుబడి కోసం చర్చలు జరుపుతోంది. మరో పక్క కంపెనీ వాల్యుయేషన్ తగ్గటం యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు రూ.9 వేల కోట్లకు పైగా ఫెమా చట్టాల ఉల్లంఘన జరిగినట్లు ఈడీ దర్యాప్తు కంపెనీ ప్రతిష్టను మసకబారుస్తోంది.


Click it and Unblock the Notifications