Byju’s: బైజూస్ దివాలాకు బీసీసీఐ.. కోర్టు బయట పరిష్కారానికి ప్రయత్నాలు..
Byju's Insolvency: ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను చూస్తోంది. వాస్తవానికి కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 ట్యూషన్ సెంటర్లను క్లోజ్ చేసింది. గడచిన 2-3 నెలలుగా అద్దె బకాయిలు, కరెంటు బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలో క్రికెట్ బోర్డు బీసీసీఐ బైజూస్ తమకు చెల్లించాల్సిన బకాయిలపై దివాలా ప్రక్రియకు కోర్టును ఆశ్రయించిది. తాజాగా ఎన్సీఎల్టీ సైతం దివాలా ప్రక్రియకు ఆమోదం తెలపటంతో సమస్య జఠిలంగా మారింది. ఈ క్రమంలో ఎడ్టెక్ మేజర్ బైజూస్ కోర్టు వెలుపల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)తో సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారని సమాచారం.

జూలై 16న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ BCCI దాఖలు చేసిన ఒక అభ్యర్థనను అనుసరించి దివాలా పరిష్కార ప్రక్రియలో బైజూజ్ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్‌ను అంగీకరించింది. ఈ క్రమంలో బైజూస్ సెటిల్మెంట్ అవకాశాన్ని అన్వేషించడానికి ముందు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ నుంచి దివాలా పరిష్కార ప్రక్రియపై స్టే పొందవలసి ఉంటుంది. అయితే దీనికి బీసీసీఐ నిరాకరిస్తే సమస్య తీవ్రతరం కావొచ్చని సమాచారం.
సెటిల్‌మెంట్‌తో ముందుకు వెళ్లడానికి ముందు ట్రిబ్యునల్ ఆర్డర్‌పై స్టే పొందేందుకు బైజూకి బీసీసీఐ సహకారం అవసరం కాబట్టి ఈ మార్గం సవాలుగా ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై బైజూస్ ప్రతినిధి స్పందిస్తూ.. తాము ఎప్పటిమాదిరిగానే BCCIతో సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని సాధించాలనుకుంటున్నట్లు తెలిపారు. అలాగే లీగల్ టీమ్ కంపెనీ ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో NCLT పంకజ్ శ్రీవాస్తవను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ గా నియమించింది. ఈయన కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఏర్పడే వరకు కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ కోడ్ ప్రకారం బైజూస్ ప్రస్తుత నిర్వహణ సంస్థపై నియంత్రణను కోల్పోయే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications