BYJU's: దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ బైజూస్. అయితే ఇటీవల కంపెనీలోని పరిస్థితులు పూర్తిగా తలకిందులైనట్లు కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల బోర్టు సభ్యులు సైతం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పరిస్థితులను సరిదిద్దగలిగే సమర్థులను ఎంచుకుంటోంది కంపెనీ. తాజాగా ఎడ్టెక్ మేజర్ BYJU ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లోబోను మానవ వనరుల విభాగానికి హెడ్ గా నియమించుకుంది. లోబో ఇన్ఫోసిస్ కంపెనీలో 2000 సంవత్సరంలో పనిచేయటం ప్రారంభించారు. అలా అక్కడే తన 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ప్రయాణాన్ని కొనసాగించారు.

అయితే తాజాగా ఆయన బైజూస్ కంపెనీకి మారారు. చివరిగా ఇన్ఫోసిస్ సంస్థలో లోబో హెడ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్‌గా పనిచేశారు. హెచ్‌ఆర్‌లో ఆయనకున్న విస్తృతమైన అనుభవం, నాయకత్వం బైజూస్ పని సంస్కృతిని మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్ అన్నారు. ఈ చర్య తమ బృంద సభ్యుల సంక్షేమం ప్రధానంగా ఉండేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బైజూస్ కంపెనీలోకి రావటంపై లోబో సైతం సంతోషం వ్యక్తం చేశారు. సంస్థను భవిష్యత్తులో సిద్ధంగా ఉండేలా మార్చడంలో సహాయపడటానికి కృషి చేస్తా అన్నారు.
టెక్నాలజీ అండ్ కన్సల్టింగ్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఇన్ఫోసిస్ స్కేల్ చేయడంతో హెచ్‌ఆర్ ఫంక్షన్‌కు సాంకేతికత, విశ్లేషణలను తీసుకువచ్చిన ఘనత లోబోదేనని బైజూస్ విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. తన ఉద్యోగులతో, ప్రజలతో నిర్మించబడిన బైజూస్ రానున్న కాలంలో అత్యుత్తమ గ్లోబల్ వర్క్ ప్లేస్ గా అభివృద్ధి చెందటానికి కంపెనీ తాజా చర్యలు దోహదపడతాయని స్టార్టప్ యాజమాన్యం భావిస్తోంది.


Click it and Unblock the Notifications