Byju’s Layoffs: మెున్న లోన్ చెల్లింపు డిఫాల్ట్.. నేడు ఉద్యోగుల తొలగింపులు..!
Byju's Layoffs: దేశీయ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. గడచిన అనేక నెలలుగా కంపెనీ పలు దఫాలుగా ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఈ వరుస తొలగింపులకు తోడు చట్టపరమైన చిక్కులు కంపెనీని కుదిపేస్తున్నాయి.
గత నెలలో ఐటీ సోదాలను మరువకముందే.. తాజాగా నవంబర్ 2021లో సేకరించిన రుణంపై 40 మిలియన్ డాలర్ల వడ్డీ చెల్లింపులను గడువు రోజు చేయలేదు. రుణం అందించిన సంస్థపై అమెరికా కోర్టులో దావా వేసింది. సమస్య పరిష్కారమయ్యాకే చెల్లింపులు చేయాలని కంపెని యోచిస్తోంది. అయితే ఈ క్రమంలో ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా 1000 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ లో తాజా తొలగింపులు జరగనున్నట్లు తెలుస్తోంది.

బైజూస్ తన చివరి ఫండింగ్ రౌండ్‌లో 22 బిలియన్ డాలర్లకు పైగా విలువను కలిగి ఉంది. ఈ ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఫండింగ్ కొరతతో దాదాపు 5000 మంది ఉద్యోగులను తొలగించింది. దేశవ్యాప్తంగా ఉన్న 280 ట్యూషన్ సెంటర్‌లలో ఒకరు లేదా ఇద్దరు ఉద్యోగులను తొలగించాలని మార్కెటింగ్ మేనేజర్‌లను కోరినట్లు తెలుస్తోంది. ఇలా తొలగిస్తున్న ఉద్యోగులకు కంపెనీ 2 నెలల జీతాన్ని చెల్లించాలని యోచిస్తోంది. దాదాపు 150 మార్కెటింగ్ మేనేజర్లు సైతం తొలగించబడనున్నారు.

కంపెనీ ఎదుర్కొంటున్న నగదు కొరత నేపథ్యంలో కంపెనీ నెలల తరబడి ప్రావిడెంట్ ఫండ్ విరాళాలు లేదా ఇన్సెంటివ్‌లను చెల్లించాల్సి ఉంది. అందువల్ల తొలగించబడే ఉద్యోగులకు వేతనం అందుతుందా అనే సందేహాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications