Byjus: భారీ అప్పుల్లో కూరుకుపోయిన దేశీయ ఎడ్ టెక్ సంస్థ బైజూస్.. రుణదాతలతో కొన్ని నెలలుగా చర్చలు జరుపుతోంది. కంపెనీ ఈ నెలాఖరులో ఫలితాలు రిలీజ్ చేయనుండగా.. నిధుల సమీకరణకు దిగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే 6 నెలల్లో రుణాల తిరిగి చెల్లింపుకు ప్లాన్ రెడీ చేస్తోంది.
రుణాలు తీర్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బైజూస్.. మరో 6 నెలల్లో 1.2 బిలియన్ డాలర్ల టర్మ్ లోన్ తిరిగి చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తాను 2021లో చేజిక్కించుకున్న గ్రేట్ లెర్నింగ్ సహా ఎపిక్ లను విక్రయించనున్నట్లు మీడియాకు తెలిపింది.

ఈ రెండు కంపెనీల నుంచి దాదాపు 1 బిలియన్ డాలర్లను బైజూస్ సమీకరించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వీటి విక్రయాలకు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లకు కట్టబెట్టాలని కంపెనీ చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
SBI మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ CFO TV మోహన్ దాస్ పాయ్ తో కూడిన ఓ సలహా మండలిని బైజూస్ ఏర్పాటు చేసింది. ఎడ్ టెక్ బోర్డుతో పాటు CEO రవీంద్రన్ కు ఈ కౌన్సిల్ సలహాలు ఇస్తూ, దిశానిర్దేశం చేస్తుంది. మండలి సలహాతోనే.. గ్రేట్ లెర్నింగ్, ఎపిక్ ల విక్రయానికి కంపెనీ నిర్ణయం తీసుకుని ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications