EPF ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగికి ప్రభుత్వమే ఉచితంగా అందించే అత్యంత కీలకమైన ప్రయోజనం EDLI ఇన్షూరెన్స్ స్కీమ్. చాలా మంది ఉద్యోగులు జీవిత బీమా పాలసీలు వేరుగా తీసుకోకపోయినా, EPFO అందించే Employees Deposit Linked Insurance (EDLI) కవరేజ్ గురించి తెలియకపోవడం వల్ల పెద్ద మొత్తాన్ని పొందకుండా మిస్ అవుతూ ఉంటారు. ఉద్యోగి మరణించినప్పుడు, అతని కుటుంబ సభ్యులు లేదా నామినీకి గరిష్టంగా రూ. 7 లక్షల వరకు బీమా మొత్తం లభిస్తుంది.
దీనికి ఉద్యోగి నుండి ఏ ఒక్క రూపాయి కూడా కట్ కానందువల్ల ఇది పూర్తిగా ఉచిత భద్రతగా చెప్పవచ్చు. ఉద్యోగి EPF ఖాతా యాక్టివ్‌గా ఉన్నంతవరకు EDLI కవరేజ్ ఆటోమేటిక్‌గా కొనసాగుతుంది. దీనికి వేరే అప్లికేషన్, ప్రీమియం లేదా రిన్యూవల్ అవసరం ఉండదు. ఉద్యోగి జీతం ఆధారంగా బీమా మొత్తం లెక్కించబడుతుంది. అయితే EPFO ప్రస్తుతం గరిష్ట పరిమితిని రూ. 7 లక్షలుగా నిర్ణయించింది.

EDLI EPF ఉచిత బీమా రూ.7 లక్షలు ఎలా అప్లై చేయాలో చాలా మంది కుటుంబాలకు తెలియదు. ఈ బీమా మొత్తాన్ని పొందే ప్రక్రియ కొంత పేపర్‌వర్క్ ఉన్నప్పటికీ.. ఒకసారి దారిని అర్థం చేసుకుంటే అది చాలా సులభతరం అవుతుంది. ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు లేదా నామినీ ఈ బీమా మొత్తం కోసం అప్లై చేయాలి. ముందుగా ఉద్యోగి EPF ఖాతా యాక్టివ్‌లో ఉందా లేదా తెలుసుకోవడం అవసరం. EPFO పోర్టల్‌లో నామినీ వివరాలు ఉన్నాయా అని కూడా కుటుంబ సభ్యులు చెక్ చేయాలి. నామినీ సరిగా ఉన్నప్పుడు క్లెయిమ్ ప్రాసెస్ వేగంగా పూర్తవుతుంది. ఈ బీమా రుజువు చేసుకునే ప్రక్రియలో ముఖ్యమైన భాగం Form 5IF. ఇది EDLI స్కీమ్ కింద బీమా క్లెయిమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఫారమ్.
కుటుంబ సభ్యులు మొదటగా ఈ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి పూర్తి వివరాలతో నింపాలి. ఉద్యోగి పేరు, PF నంబర్, UAN, సంస్థ పేరు, మరణించిన తేదీ, మరణ పరిస్థితులను వివరించాలి. ఇది పూర్తయిన తరువాత ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుడి బ్యాంక్ పాస్‌బుక్ లేదా క్యాన్సిల్ చెక్, మరణ ధృవపత్రం, ఉద్యోగి ఉద్యోగ ధృవీకరణ వంటి పత్రాలను జత చేయాలి. ఫారమ్‌లో పేర్కొన్న నామినీ లేదా కుటుంబ సభ్యుల సంబంధాన్ని రుజువు చేసే పత్రాలు కూడా అవసరం అవుతాయి. కొన్నిసార్లు సంస్థ ఉద్యోగి మరణ ధృవీకరణ లెటర్ కూడా ఇస్తుంది. అది అప్లికేషన్‌తో సహా జత చేయాలి.
ఈ మొత్తం డాక్యుమెంట్లు ఒకసారి సిద్ధమైన తర్వాత ఉద్యోగి పనిచేసిన సంస్థ వద్దకు వెళ్లి ఫారమ్‌పై వారి అధికారిక సంతకం, ముద్ర పొందాలి. సంస్థ ఈ ఫారమ్‌ను ధృవీకరించడం చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే EPFO కార్యాలయం దీనినే ఆధారంగా తీసుకుని ఉద్యోగి వాస్తవంగా అక్కడ పనిచేశాడా లేదా నిర్ణయిస్తుంది. కొన్ని సందర్భాల్లో చిన్న కంపెనీలు సహకరించకపోతే.. కుటుంబ సభ్యులు EPFO ప్రాంతీయ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించి మార్గదర్శకత్వం పొందవచ్చు.
ఫారమ్ పూర్తిగా ధృవీకరించబడిన తర్వాత దాన్ని సమీప EPFO కార్యాలయానికి సమర్పించాలి. అక్కడ క్లెయిమ్‌ను నమోదు చేసి, రిసీవ్ అక్క్నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. EPFO అధికారులు పత్రాలను పరిశీలించి, మరిన్ని వివరాలు అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదిస్తారు. పత్రాలు సరిగా ఉన్నట్లయితే క్లెయిమ్ సాధారణంగా 30 నుండి 45 రోజుల్లో సెటిల్ అవుతుంది. బీమా మొత్తం నామినీ బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుంది. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు EPFO హెల్ప్‌లైన్ లేదా grievance portal ద్వారా కూడా ఫాలోఅప్ చేయవచ్చు. ఏదేమైనా EDLI బీమా క్లెయిమ్ చేయడం క్లిష్టమైన ప్రక్రియలా కనిపించినా, ఉద్యోగి నామినేషన్ సరిగ్గా ఉండి.. పత్రాలు పూర్తిగా సిద్ధంగా ఉంటే మొత్తం ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇది ఉద్యోగి కుటుంబానికి కీలకమైన ఆర్థిక భద్రతను అందిస్తుందని గుర్తుంచుకోవాలి.
EPF ఉద్యోగులకు EDLI బీమా ఎంత ముఖ్యమైనదో గ్రహించాలి. ఉద్యోగి మరణించినప్పుడు కుటుంబం ఆర్థికంగా నిలబడటానికి ఈ రూ.7 లక్షల ఇన్షూరెన్స్ ఎంతో ఉపకరిస్తుంది. దీన్ని పొందడానికి EPF నామినేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, కుటుంబ సభ్యులకు ఈ సమాచారం చెప్పడం ఉద్యోగుల బాధ్యత. EDLI స్కీమ్‌తో ఉద్యోగి కుటుంబం కనీస ఆర్థిక భద్రతను పొందుతుంది. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఈ హక్కును కోల్పోకుండా ఇప్పుడే వివరాలు సరిచూసుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులకు తను పని చేసే ప్రదేశం..అలాగే పీఎఫ్ వివరాలు, ఎలా తీసుకోవాలనే విషయాలు కుటుంబ సభ్యులతో పంచుకోవడం చాలా ముఖ్యం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications