కరోనా సమయంలో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. ఉదాహరణకు గోల్డ్ డ్రాప్, ఫ్రీడమ్ వంటి నూనె ధరలు ఓసమయంలో రూ.180ని దాటాయి. అయితే ఇప్పుడు ఆ ధరలు రూ.150 దిగువకు వచ్చాయి. కరోనా ముందుస్థాయికి పడిపోకపోయినప్పటికీ, ధరలు మాత్రం భారీగా తగ్గాయి. ధరలు 15 శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. సామాన్యులకు ఊరటను కల్పిస్తూ ఆయా వంట నూనెల ధరలను రూ.7 నుండి రూ.20 వరకు కేంద్రం తగ్గించాయి. దిగుమతి సుంకాలు భారీగా తగ్గడంతో వంట నూనె ధరలు కూడా తగ్గాయి.
అంతేకాదు, రాబోయే కొద్ది రోజుల్లో వంట నూనెల ధరలు మరింత తగ్గే అవకాశముందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాకర్స్ అసోసియేషన్ (SEA) వెల్లడించింది. కేంద్రం దిగుమతి సుంకాలు తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలీ చేయడంతో ఎడిబుల్ ఆయిల్ ధరలు గత నెల రోజుల్లో కిలోకు రూ.8 నుండి రూ.10 తగ్గిందని ఇండస్ట్రీ బాడీ SEA తెలిపింది.

నూనె ధరలు మరింత తగ్గుతాయా?
కరోనా సెకండ్ వేవ్ సమయంలో రూ.180 నుండి రూ.190 మధ్య ఉన్న నూనె ధర ఇప్పుడు రూ.140 నుండి రూ.150కి పడిపోయింది. గత నెల రోజుల్లో రూ.10 వరకు తగ్గింది. రాబోయే కొద్ది రోజుల్లో మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయని SEA చెబుతోంది. వచ్చే కొద్ది నెలల్లో కిలో నూనె ధర రూ.3 నుండి రూ.4 మధ్య తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్‌కు తోడు, దేశవ్యాప్తంగా నూనె గింజల సాగు గణనీయంగా ఉన్నదని, దీంతో ధరలు తగ్గే అవకాశముందని అంటున్నారు.

అప్పుడు అందుకే పెరిగాయి
ప్రపంచవ్యాప్తంగా వంట నూనె ధరలు కొంతవరకు బేరిష్‌గా ఉన్నాయని, మన దేశం దాదాపు 65 శాతం దిగుమతి నూనెల పైన ఆధారపడిందని, అంతకుముందు అంతర్జాతీయంగా ధరలు పెరగడం, దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటంతో నూనె ధరలు పెరిగాయని SEA ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది అన్నారు. ఇప్పుడు దిగుమతి సుంకాలు తగ్గడం, మన వద్ద నూనె గింజల సాగు పెరగడం, అంతర్జాతీయంగా ధరలు తగ్గడం వంటి అంశాలు ప్రభావం చూపి, ధరలు తగ్గుతున్నట్లు చెప్పారు.

సాగు పెరిగింది..
దీపావళి పండుగకు ముందే వంట నూనె ధరలను సాధ్యమైనంత మేర తగ్గించాలని SEA తన సభ్యులకు సూచించిందని అతుల్ చతుర్వేది గుర్తు చేశారు. ఎడిబుల్ ఆయిల్స్ పైన కేంద్రం దిగుమతి సుంకాలను తగ్గించడంతో ఈ తగ్గింపు సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. ఫలితంగా గత ముప్పై రోజుల్లో రూ.8 నుండి రూ.10 వరకు ధర తగ్గిందన్నారు.
ఈ తక్కువ ధర ప్రయోజనాలను వినియోగదారులకు అందించడంలో కంపెనీలు సానుకూలంగా స్పందిస్తున్నాయన్నారు. వచ్చే కొద్ది నెలల్లో మరో రూ.4 వరకు తగ్గవచ్చునని, రాబోయే పండుగ సమయంలో కస్టమర్లకు ఇది భారీ ఊరట అన్నారు. ప్రస్తుతం దేశంలో 120 లక్షల టన్నుల సోయాబీన్ పంట, 80 లక్షల టన్నుల వేరుశనగ పంట సాగు అవుతోందని, కాబట్టి ధరలు మాత్రం అందుబాటులోనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఆవాల గింజ సాగు భారీగా పెరిగిందని, దాదాపు 77.62 లక్షల హెక్టార్లలో ఆల్ టైమ్ గరిష్టమని చెప్పారు. ఇది దాదాపు 30 శాతం అధికమని చెప్పారు. దీంతో వచ్చే ఏడాది ఆవాల నూనె లభ్యత 8 లక్షల నుండి 10 లక్షల టన్నులకు పెరగవచ్చునని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కూడా నూనె ధరలు తగ్గుదలకు అవకాశముందన్నారు.
భారత్ 65 శాతం ఎడిబుల్ ఆయిల్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగం 22 మిలియన్ టన్నులకు పైగా ఉండగా, 13 మిలియన్ టన్నుల నుండి 15 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకుంటోంది. కరోనా కారణంగా గత ఏడాది నవంబర్ నుండి ఈ ఏడాది అక్టోబర్ వరకు 13 మిలియన్ టన్నులకు పడిపోయింది. 2019-20లో దిగుమతులు రూ.71,600 విలువ కలిగిన 13.2 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకోగా, 2020-21లో రూ.1.17 లక్షల కోట్ల విలువ కలిగిన దిగుమతులు నమోదు చేసింది. దేశీయ నూనెల వినియోగంలో ఇది 63 శాతం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications