ఐసిఐసిఐ వీడియోకాన్ రుణ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ కు ముంబైలోని ప్రత్యేక కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన దీపక్ కొచ్చర్ చేసిన విజ్ఞప్తిని ముంబై నుండి ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పోస్ట్ కోవిడ్ -19 చికిత్స కోరుతూ ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ చేసిన విజ్ఞప్తిని ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.

ఐసిఐసిఐ బ్యాంక్-వీడియోకాన్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దీపక్ కొచ్చర్ ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత నెలలో అరెస్టు చేసింది. అరెస్టు చేసిన కొద్ది రోజుల తరువాత, దీపక్ కొచ్చర్ కరోనావైరస్ బారిన పడ్డారు. కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆయన ఇటీవల కరోనా పాజిటివ్ నుండి నుండి కోలుకున్నాడు . కరోనా నుంచి కోలుకున్న తరువాత మళ్లీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు .
నవీ ముంబైలోని తలోజా జైలులో ప్రస్తుతం దీపక్ కొచ్చర్ ఉన్నారు.
జైలులో ఉన్న ఆయన కరోనా వైరస్ సంక్రమణ నేపథ్యంలో, ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగా ఆయనను న్యాయవాది దీపక్ కొచ్చర్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి మార్చాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆ విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ పి రాజవైద్యా తిరస్కరించారు. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు 81,875 కోట్ల రుణాలను అక్రమంగా మంజూరు చేసినందుకు చందా కొచ్చర్ మరియు దీపక్ కొచ్చర్ మరియు లావాదేవీలు నిర్వహించిన వీడియోకాన్ వ్యాపార సంస్థలపై మనీలాండరింగ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications