Manappuram Finance: కేరళ కేంద్రంగా వ్యాపారాలను నిర్వహిస్తోంది మణప్పురం ఫైనాన్స్ సంస్థ. అయితే మనీలాండరింగ్ ఆరోపణలతో కంపెనీ ఆఫీసుల్లో నేడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు విరుద్ధంగా కంపెనీ రూ.150 కోట్లకు పైగా పబ్లిక్ డిపాజిట్లను సేకరించిందన్న ఆరోపణల నేపథ్యంలో దాడులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కేరళలోని త్రిసూర్ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రమోటర్లకు సంబంధించిన మెుత్తం నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.

ఈ క్రమంలో అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారన్న ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించటంపై మణప్పురం ఫైనాన్స్ వివరణ ఇచ్చింది. డిపార్ట్‌మెంట్‌కు తమ పూర్తి సహాయాన్ని అందజేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్లప్పుడూ కార్పోరేట్ గవర్నెన్స్, అత్యుత్తమ విధానాలకు కట్టుబడి ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రధానంగా RBI అనుమతి లేకుండా ప్రజల నుంచి రూ.150 కోట్లకు పైగా డిపాజిట్లను అక్రమంగా సేకరించారని ఈడీ ఆరోపించింది. ఇందులో భాగంగా కేవైసీ నిబంధనలను పాటించకుండా పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారనే కోణంలో తాజా సోదాలు జరిగాయని తెలుస్తోంది. కంపెనీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మణప్పురం షేర్లు మార్కెట్లో భారీగా నష్టపోయాయి. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి షేర్ ఎన్ఎస్ఈలో 12.22 శాతం నష్టపోయి రూ.113.85 వద్ద ట్రేడింగ్ ముగించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications