ED Raids: బ్రైట్‌కామ్ గ్రూప్ సీఈవో, సీఎఫ్‌వో ఇళ్లలో ఐటీ సోదాలు.. పూర్తి వివరాలు..
ED Raids: రెండు రోజుల కిందట సెబీ బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్ల క్రయవిక్రయాలు జరపకుండా కొంతమందిపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఫెమా 1999 నిబంధనల ప్రకారం CEO, CFO, కంపెనీ ఆడిటర్ పి మురళీ మోహన్ రావు నివాసాలతో సహా హైదరాబాద్‌లోని 5 ప్రదేశాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. రెగ్యులేటరీ నిబంధనల ఉల్లంఘనకు సెబీ జూన్ లో కంపెనీ, దాని ప్రమోటర్లపై రూ.40 లక్షల జరిమానా విధించింది.
నేడు నిర్వహించిన సోదాల్లో వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలు, లెక్కలో చూపని నగదు లభించాయని ED ట్వీట్ చేసింది. రూ.3.30 కోట్లు, బంగారు ఆభరణాలు దొరికినట్లు వెల్లడించింది. ఆడిటర్ పి. మురళీ మోహన్ రావు నివాసంలో రూ.9.30 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్/జూదానికి సంబంధించిన కేసులో వివిధ వ్యక్తులు/సంస్థల బ్యాంక్ ఖాతాలలో అందుబాటులో ఉన్న రూ.5.87 కోట్ల విలువైన చరాస్తులను ED తాత్కాలికంగా అటాచ్ చేసింది.

గీత కంచర్ల, విజయ్ కుమార్ కంచర్ల HUF, విజయ్ కుమార్ కంచర్ల, HUF కర్త M సురేష్ కుమార్ రెడ్డి (ఛైర్‌పర్సన్ & MD) ఒక్కొక్కరికి రూ.6 లక్షలు, SV రాజ్యలక్ష్మి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున.. SEBI రూ.12 లక్షల చొప్పున జరిమానా విధించింది. ప్రముఖ ఇన్వెస్టర్ శంకర్ శర్మ సహా 23 మందిపై సెబీ నిషేధం విధించింది. PMLA 2002 కింద భువనేశ్వర్‌లోని M/s జ్యోతి ట్రేడింగ్ & కో యజమాని జ్యోతి రంజన బ్యూరా గోల్డెన్ బాబాకు సంబంధించి రూ.1.53 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు.
విజయ్ కుమార్ కంచర్ల HUF, M సురేష్ కుమార్ రెడ్డి, SV రాజ్యలక్ష్మి రెడ్డి మరియు గీత కంచర్ల BGL షేర్లలో ఏప్రిల్ 2020 నుంచి ఆగస్టు 2021 వరకు ట్రేడింగ్ చేసినట్లు రెగ్యులేటర్ తన విచారణలో గుర్తించింది. మార్కెటింగ్ సంస్థకు షేర్ల ప్రాధాన్యత కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న కారణంగా బ్రైట్‌కామ్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం సురేష్ కుమార్ రెడ్డి, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నారాయణ్ రాజు డైరెక్టర్‌షిప్‌లను నిర్వహించకుండా సెబీ ఈ వారం నిషేధించింది.సెబీ తన ప్రిఫరెన్షియల్ కేటాయింపులో బ్రైట్‌కామ్ "మానిప్యులేషన్"ను గుర్తించింది. దీంతో సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా డీల్ చేయడం నుంచి రెడ్డిని నిషేధిస్తున్నట్లు పేర్కొంది.
హైదరాబాద్‌కు చెందిన డిజిటల్ మార్కెటింగ్ సంస్థ నకిలీ, కల్పిత బ్యాంకు వివరాలను సమర్పించడం ద్వారా చేసిన మోసపూరిత చర్యలను కప్పిపుచ్చాలని చూసినట్లు సెబీ ఈనెల 23న గుర్తించింది. దీనిపై చర్యలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని, సాధ్యమయ్యే చర్యలను విశ్లేషిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే తాజా పరిణామాల వల్ల సోమవారం కంపెనీ షేర్లు మార్కెట్లో భారీ పతనాన్ని చూడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications