ED on Vivo Case: చాలా కాలం తర్వాత మరోసారి వివో మనీలాండరింగ్ వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. గత కొంత కాలంగా దీనిపై భారత ప్రభుత్వ సంస్థ దర్యాప్తు కొనసాగిస్తోంది.
ఈ క్రమంలో తాజాగా చైనీస్ ఫోన్ తయారీ సంస్థ వివోపై మనీలాండరింగ్ దర్యాప్తులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. వివో 2014-2021 మధ్య కాలంలో భారతదేశం బయట లక్ష కోట్ల రూపాయలను చెల్లించడానికి షెల్ కంపెనీలను ఉపయోగించిందని ఈడీ వెల్లడించింది.

అక్టోబర్‌లో ఈ కేసులో లావా ఇంటర్నేషనల్ కంపెనీ ఎండీ హరి ఓం రాయ్, చైనా జాతీయుడు గ్వాంగ్వెన్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, చార్టర్డ్ అకౌంటెంట్లు నితిన్ గార్గ్, రాజన్ మాలిక్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. 2022లో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ.. గత ఏడాది జూలైలో వివో-ఇండియా దాని అనుబంధ వ్యక్తులపై దాడి చేసింది. చైనా జాతీయులు, బహుళ భారతీయ కంపెనీలతో కూడిన ప్రధాన మనీలాండరింగ్ రాకెట్‌ను ఛేదించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
దిల్లీలోని ప్రత్యేక కోర్టు ముందు బుధవారం ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో దేశం నుంచి భారీ మెుత్తాలను స్వాహా చేసినందుకు రాయ్, గ్వాంగ్‌వెన్ క్యాంగ్ అలియాస్ ఆండ్రూ కుయాంగ్, గార్గ్, మాలిక్‌ల పేర్లను ఈడీ పేర్కొంది. వివో కంపెనీ దేశంలో 2014లో ప్రవేశించిన తర్వాత వివిధ భారతీయ నగరాల్లో మరో 19 కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఈడీ కనుగొంది. ఈ కంపెనీలకు చైనా జాతీయులు డైరెక్టర్లుగా లేదా వాటాదారులుగా ఉన్నారు. వారు దేశంలోని పూర్తి లాజిస్టిక్స్‌ను నియంత్రించారు.
నిందితులు మారువేషంలో మరియు మోసపూరిత పద్ధతిలో భారతదేశంలోకి ప్రవేశించారాని ఈడీ అక్టోబరులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. వారు దేశమంతటా విస్తృతమైన చైనా-నియంత్రిత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి ఆర్థిక సార్వభౌమాధికారానికి హాని కలిగించే కార్యకలాపాలను నిర్వహించనట్లు ఆరోపించింది. అలాగే వివో 2014 నుంచి 2018 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది. FDI నిబంధనలను సద్వినియోగం చేసుకుని "అండర్ ది గార్బ్" క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ తన యాజమాన్యాన్ని దాచిపెట్టిందని పేర్కొంది.


Click it and Unblock the Notifications