ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2002 మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) నిబంధనల ప్రకారం లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ రూ. 457 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను స్తంభింపజేసింది. లాటరీ రారాజు నివాసాలు, కార్యాలయాల్లో మే 11 మరియు 12 తేదీల్లో సోదాలు జరిగాయి.
మార్టిన్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. మార్టిన్, ఇతరులపై PMLA కింద కేసు నమోదు చేశారు.
కోయంబత్తూరులోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ రిజిస్టర్డ్ ఆఫీస్ ప్రాంగణాన్ని, సిక్కిం లాటరీల మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ శాంటియాగో మార్టిన్ నివాస ప్రాంగణాన్నే కాకుండా చెన్నైలోని అతని కుటుంబ సభ్యుల వ్యాపారం, నివాసాల్లో ED సోదా చేసింది. కేరళ రాష్ట్రంలో సిక్కిం ప్రభుత్వ లాటరీల విక్రయాలకు సంబంధించి వివిధ శిక్షార్హమైన నేరాలకు సంబంధించి సీబీఐ తుది నివేదిక ఆధారంగా మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించింది.

"PMLA పరిశోధనల నుంచి S. మార్టిన్, అతని అసోసియేట్ కంపెనీలు & సంస్థలు సిక్కిం ప్రభుత్వానికి ప్రైజ్-విజేత టిక్కెట్ల క్లెయిమ్‌ను పెంచి రూ. 910 కోట్ల మేరకు చట్టవిరుద్ధంగా లాభపడ్డాయని కనుగొన్నారు. విలువైన చరాస్తులను స్తంభింపజేయడానికి PMLA కింద ఆదేశాలు జారీ చేశారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌తో సహా రూ.157.7 కోట్లు, రూ.299.16 విలువైన స్థిరాస్తి పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల సోదాల్లో రూ. 457 కోట్ల (సుమారు.) విలువైన ఆదాయానికి మించి ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులను స్తంభింపజేసినట్లు ED తెలిపింది.


Click it and Unblock the Notifications