ED Raids on Religare: ఈడీ అధికారులు రెలిగేర్ ఎంటర్ ప్రైజ్ సంస్థ ప్రతినిధులపై సోదాలు నిర్వహించింది. ఉదయం దీనికి సంబంధించిన కొన్ని ఊహాగానపు వార్తలు రాగా ప్రస్తుతం అధికారికంగా క్లారిటీ వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ వారం ప్రారంభంలో రెలిగేర్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్ రష్మీ సలూజాతో సహా సీనియర్ అధికారులకు సంబంధించిన పలు ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించిందని రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ ఆగస్టు 23న అధికారికంగా వెల్లడించింది. ఈ క్రమంలో ఈడీ అధికారులు దాదాపు రూ.2000 కోట్లకు సంబంధించి నిధులను దారి మళ్లించారనే ఆరోపణలపై దర్యాప్తు చేపడుతున్నారు. ఇది పూర్తిగా రెలిగేర్ ఫిన్వెస్ట్ కి సంబంధించిన వ్యవహారంగా తెలుస్తోంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కంపెనీకి చెందిన రష్మీ సలూజా, నితిన్ అగర్వాల్, నిశాంత్ సింఘాల్, చిరాగ్ జైన్ వంటి కీలక సీనియర్ అధికారుల ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. వాస్తవానికి సెర్చ్ ఆపరేషన్ కంపెనీకి చెందిన పూర్వపు ప్రమోటర్లకు సంబంధించినవిగా వెల్లడైంది. బర్మన్ గ్రూప్‌కు చెందిన నాలుగు కొనుగోలుదారులు, బర్మన్ కుటుంబ సభ్యులు, అభయ్ అగర్వాల్, JM ఫైనాన్షియల్‌పై ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ఈ సోదాలు జరిగాయి. అయితే సోదాల్లో ఎలాంటి నేరారోపణ పత్రాలు లభించలేదని కంపెనీ తెలిపింది.
అయితే రష్మీ సలూజా, నితిన్ అగర్వాల్, నిశాంత్ సింఘాల్ అందుకున్న కంపెనీ ఆరోగ్య బీమా అనుబంధ సంస్థ అయిన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ESOP షేర్లను ఈడీ స్తంభింపజేసింది. ఈ ఏడాది జూన్ నెలలో డాబర్ ఇండియా ప్రమోటర్ బర్మన్ కుటుంబ ఓపెన్ ఆఫర్ కోసం రెగ్యులేటరీ అధికారుల నుంచి చట్టబద్ధమైన అనుమతులు పొందాలని మార్కెట్‌ల పర్యవేక్షణ సంస్థ సెబీ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ RELని ఆదేశించింది. ఈ క్రమంలో విడుదల చేసిన బహిరంగ ప్రకటన ప్రకారం వారు కంపెనీ విస్తరించిన ఓటింగ్ షేర్ క్యాపిటల్‌లో 26 శాతం వరకు ఒక్కో షేరుకు రూ.235 చొప్పున మొత్తం రూ.2,115.99 కోట్లతో కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. తర్వాత ఈ ప్రకటన రెలిగేర్ స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ సెబీ ముందు పలు అభ్యంతరాలను లేవనెత్తింది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications