Niranjan Hiranandani: ప్రస్తుతం దేశంలో అనేక కార్పొరేట్ కంపెనీలపై దేశంలోని అనేక శాఖల సోదాలు కలకలం రేపుతున్నాయి. అక్రమంగా విదేశాలకు నిధుల మళ్లింపుల ఆరోపణలతో చాలా కంపెనీలపై గత కొన్ని నెలలుగా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఎన్నికల వేళ మరికొన్ని దాడులు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం ముంబై కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ హీరానందని గ్రూప్ ప్రాంగణాల్లో ఈడీ సోదాలు జరిగాయి. ఇవి జరిగిన కొద్దిరోజుల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఫారెక్స్ ఉల్లంఘన కేసులో నిరంజన్ హీరానందనీ, అతని కుమారుడు దర్శన్ హీరానందనీకి సమన్లు అందాయి. వీరిని దర్యాప్తు కోసం సోమవారం దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని అధికారులు కోరారు. ప్రస్తుతం నందని నాన్ రెసిడెంట్ ఇండియన్(NRI), దుబాయ్‌లో నివసిస్తున్నందున దర్శన్ హీరానందనీకి ఇమెయిల్ ద్వారా అధికారులు నోటీసులు పంపినట్లు సమాచారం.

నిరంజన్ హీరానందని రియల్ ఎస్టేట్ మేజర్ హీరానందని గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్. విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసుకు సంబంధించి ముంబయిలోని హీరానందానీ గ్రూప్ ప్రాంగణంలో గురువారం ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలసిందే. నిరంజన్ హీరానందని నివాసం, గ్రూప్ రిజిస్టర్డ్, కార్పొరేట్ కార్యాలయాలు సహా నాలుగు ప్రదేశాల్లోఈ సోదాలు జరిగాయి. ఈ వ్యవహారంలో ఆఫ్ షోర్ ట్రస్ట్ ద్వారా వీరి కుటుంబం 60 మిలియన్ డాలర్ల మేర లబ్ధిని పొందినట్లు పండోరా పేపర్స్‌లో కూడా పేర్కొనబడింది.
2006-2008 మధ్య కాలంలో హిరానందనీలు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో కనీసం 25 కంపెనీలను, ట్రస్ట్‌ను స్థాపించారు. ప్రస్తుతం దేశంలోని మహారాష్ట్ర, తమిళనాడులో వ్యాపారాలు చేస్తున్న కంపెనీ విదేశీ పెట్టుబడుల్లో రూ.400 కోట్లకు పైగా మళ్లించినట్లు ప్రభుత్వ ఏజెన్సీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో వారు మార్గదర్శకాలను ఉల్లంఘించారని చెబుతోంది.
మార్చి 2022లో ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో విస్తరించి ఉన్న హీరానందానీ గ్రూప్‌కు చెందిన 25 ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిగాయి. పన్ను ఎగవేత అనుమానాలే దీనికి కారణంగా ఉంది. సోదాల సమయంలో అధికారులు హీరానందానీ గ్రూప్‌కు చెందిన పత్రాలు, ఫైనాన్స్‌ల ఇ-రికార్డులు, అమ్మకాల లావాదేవీలను పరిశీలించారు.


Click it and Unblock the Notifications