Vivo case: వివో మొబైల్స్‌కు ED దిమ్మతిరిగే షాక్.. మనీలాండరింగ్‌ కేసులో దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థ

Vivo case: అక్రమాస్తులు, మనీ లాండరింగ్‌ వంటి తీవ్ర ఆర్థిక నేరాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోంది. ముఖ్యంగా చైనాతో ఏర్పడిన ప్రతిష్ఠంభన నేపథ్యంలో డ్రాగన్ కంట్రీకి సంబంధం ఉన్న ఏ సంస్థనూ వదలడం లేదు.

మనీ లాండరింగ్ ఆరోపణలపై చైనాకు చెందిన తయారీదారు వివో మొబైల్స్ పై విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా వివో ఇండియాకు చెందిన నలుగురు ఎగ్జిక్యూటివ్స్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. వారిలో ఒక చైనా సిటిజన్ కూడా ఉన్నారు.

ED arrests vivo India executives on money laundering case

లావా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు హరి ఓం రాయ్ కూడా ED చర్యల్లో భాగంగా అరెస్టు అయ్యారు. అయితే ఆయన ప్రమేయంపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గ్రాండ్ ప్రాస్పెక్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ (GPICPL) సహా ఇండియాలోని వివో మొబైల్స్ కు చెందిన 23 అనుబంధ కంపెనీలపై గతేడాది దాడులు నిర్వహించిన అనంతరం ఇప్పుడు అరెస్టులకు ED అధికారులు తెరతీశారు.

GPICPL మోసం మరియు నేరపూరిత కుట్రకు పాల్పడిందని ఆరోపిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదు మేరకు గతేడాది ఈ కేసులో FIR నమోదైంది. అక్రమంగా చైనాకు నిధులు బదిలీ చేయడమే లక్ష్యంగా పలు కంపెనీలను విలీనం చేశారని ED ఆరోపించిది. వివో మొబైల్స్ అమ్మకాల ఆదాయంలో దాదాపు సగం 1.25 లక్షల కోట్లను చైనాకు తరలించి, ఇండియాలో పన్నులు ఎగవేసినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+