ECOS Mobility IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల రద్దీ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానంగా ఎస్ఎమ్ఈ కేటగిరీ ఎంట్రీలపై జాగ్రత్తగా ఉండాలని ఈవారం మార్కెట్ లెగ్యులేటరీ సంస్థ సెబీ పెట్టుబడిదారులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇన్వెస్టర్లలో జోరు ఏమాత్రం తగ్గటం లేదు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఈసీఓఎస్ మెుబిలిటీ అండ్ హాస్పిటాలిటీ కంపెనీ ఐపీవో గురించే. ప్రస్తుతం కంపెనీ ఐపీవో సబ్‌స్క్రిష్టన్ గడువు ముగిసింది. ఈ క్రమంలో ఐపీవో పెట్టుబడిదారుల నుంచి గడచిన మూడు రోజులు విశేష స్పందనను పొందింది. బిడ్డింగ్ చివరి రోజున భారీగా 64.18 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంది. వాస్తవానికి కంపెనీ 1,80,00,000 షేర్లను ఐపీవోలో విక్రయానికి ఉంచగా.. దరఖాస్తుదారులు 80,86,90,256 షేర్ల కోసం బిడ్డింగ్ వేసినట్లు ఎన్ఎస్ఈ డేటా ప్రకారం వెల్లడైంది. పైగా ఐపీవోలో పూర్తిగా షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించబడుతున్నాయి.

ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి వచ్చిన భారీ స్పందనతో అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్ల భాగం 136.85 రెట్లు, సంస్థాగతేతర పెట్టుబడిదారుల కోసం 71.17 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 19.66 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. ఐపీవో తెరుచుకున్న తొలిరోజునే పూర్తిగా సబ్‌స్క్రైబ్ చేయబడింది. పెట్టుబడిదారుల కోసం ఆగస్టు 28 నుంచి 30 వరకు అందుబాటులో ఉన్న ఐపీవో తన ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.318-334గా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం గ్రేమార్కెట్లో కంపెనీ ఐపీవో ఒక్కో షేరు రూ.152 ప్రీమియం పలుకుతున్నాయి. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగినట్లయితే స్టాక్ రూ.486 రేటు వద్ద మార్కెట్లో లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో జాబితా కానుంది.
కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే దేశంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా కార్పొరేట్ క్లయింట్‌లకు ఉద్యోగుల రవాణా సేవలు, డ్రైవర్ కార్ రెంటల్ వ్యాపారంలో ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ కోసం దిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగళూరు నగరాల్లో కంపెనీ వాహనాలను అందిస్తోంది. లగ్జరీ కోచ్‌లు, మినీవ్యాన్‌లు, ఎకానమీ ఆటోమొబైల్స్‌తో సహా 12,000 వాహనాలను నిర్వహిస్తోంది.
ఇండిగో, హెచ్‌సీఎల్ కార్పొరేషన్, సేఫ్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్, డెలాయిట్, అర్బన్‌క్లాప్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్, ఫార్‌సైట్ గ్రూప్ వంటి కార్పొరేట్ సంస్థలతో వ్యాపారం నిర్వహిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.554.41 కోట్లుగా ఉండగా పన్ను తర్వాత నికర లాభం రూ.62.53 కోట్లుగా నమోదైంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications