IPO News: ఆగస్టు 28న వస్తున్న ఐపీవో.. బెట్టింగ్ వేసేముందు ఈ వివరాలు తెలుసుకోండి
ECOS Mobility IPO: నెలలు వారాలు మారుతున్న భారతీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలు రద్దీ ఏమాత్రం తగ్గటం లేదు. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం ఒడిదొడుకుల ఈక్విటీ మార్కెట్ల కంటే కొంత సమయంలో లిస్టింగ్ గెయిన్స్ కోసం ఐపీవోలపై ఎక్కువగా బెట్టింగ్ వేస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రానున్న వారంలో ప్రారంభం కానున్న ECOS ఇండియా మొబిలిటీ అండ్ హాస్పిటాలిటీ ఐపీవో గురించే. కంపెనీ ఐపీవో ఆగస్టు 28న ఇన్వెస్టర్ల కోసం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కంపెనీ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ప్రకటించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో ఆగస్టు 28 నుంచి 30 వరకు అందుబాటులో ఉండనుంది. రూ.2 ఫేస్ వ్యాల్యూ కలిగిన షేర్లకు ఆఫర్ ధరను రూ.318 నుంచి రూ.334గా కంపెనీ నిర్ణయించింది. అయితే యాంకర్ ఇన్వెస్టర్లకు కోసం ఐపీవో ఒక్కరోజు ముందుగా అంటే ఆగస్టు 27న అందుబాటులో ఉంటుంది.

తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.601.20 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ 1.8 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో లిస్టింగ్ కానున్న కంపెనీ లాట్ పరిమాణాన్ని 44 షేర్లుగా నిర్ణయించింది. ఎవరైనా రిటైల్ ఇన్వెస్టర్ కంపెనీ ఐపీవోలో పాల్గొనేందుకు ఒక లాట్ కొనుగోలు కోసం రూ.14,696 వెచ్చించాల్సి ఉంటుంది. ఐపీవోకి ముందు ప్రమోటర్లకు కంపెనీలో ఏకంగా 97.75 శాతం వాటాలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం స్టాక్ లిస్టింగ్ సెప్టెంబర్ 4న ఉంటుందని తెలుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 31 శాతం పెరిగి రూ.554 కోట్లుగా ఉంది. ఈ కాలంలో కంపెనీ నికర లాభం రూ.62.531 కోట్లుగా ఉంది.
కంపెనీ 1996 ఫిబ్రవరిలో స్థాపించబడింది. దేశంలో డ్రైవర్‌తో నడిచే కారు అద్దె సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్న కంపెనీ ప్రాథమిక వ్యాపారం డ్రైవర్డ్ కార్ రెంటల్స్, ఉద్యోగుల రవాణా సేవలు అందించటంలో ఉంది. అలాగే ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా కార్పొరేట్ క్లయింట్‌లకు సేవలను అందిస్తోంది. కంపెనీ ప్రస్తుతం దేశంలోని 109 నగరాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇది 21 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉంది


Click it and Unblock the Notifications