'అమెరికన్' మ్యాజిక్ ఉందిగా... ఇవి మనల్నేం చేయలేవ్: కరోనాపై వారెన్ బఫెట్

వాషింగ్టన్: కరోనా మహమ్మారి దెబ్బ తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని బెర్క్‌షైర్ హాత్‌వే చైర్మన్-సీఈవో వారెన్ బఫెట్ శనివారం అన్నారు. ఆయన వర్చువల్ వాటాదారుల సమావేశంలో పాల్గొన్నారు. అమెరికాను ప్రాథమికంగా ఏదీ ఆపలేదన్నారు. అంటే కరోనా వంటి తాత్కాలిక అంశాలు ఆమెరికా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయలేవని అభిప్రాయపడ్డారు.

అమెరికాను ఇవేం చేయలేవు.. ఉదాహరణలివే..

అమెరికాను ఇవేం చేయలేవు.. ఉదాహరణలివే..

రెండో ప్రపంచ యుద్ధం ఇందుకు నిదర్శనమని వారెన్ బఫెట్ అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత కూడా క్యూబన్ మిసైల్ క్రైసిస్, 9/11 దాడులు, ప్రపంచ ఆర్థిక సంక్షోభం.. ఇలా ఎన్నింటినో చూశామని, అవి ఏవీ కూడా అమెరికాను ఆపలేకపోయాయని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు కూడా కరోనా వైరస్ సంక్షోభాన్ని అమెరికా ధీటుగా ఎదుర్కోగలదన్నారు.

దశాబ్దం క్రితం సంక్షోభం కంటే భిన్నం

దశాబ్దం క్రితం సంక్షోభం కంటే భిన్నం

ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటోందని వారెన్ బఫెట్ అన్నారు. దశాబ్దం క్రితం సంక్షోభంతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉందని చెప్పారు. 2008-09లో అమెరికా వివిధ కారణాలతో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ఈసారి ఆర్థిక రైలు సులభంగా పట్టాలెక్కుతుందని అభిప్రాయపడ్డారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు మంచి రోజులు

అమెరికా ఆర్థిక వ్యవస్థకు మంచి రోజులు

కరోనా వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అమెరికా కోలుకుంటుందని చెబుతున్న వారెన్ బఫెట్ ఆర్థిక వ్యవస్థకు మరింత మంచి రోజులు రాబోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అందరు కూడా అమెరికా రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అమెరికా కోలుకుంటుందని ధీమాగా ఉండవచ్చునని, మార్కెట్లు ఏమైనా చేయగలవన్నారు.

'అమెరికన్' మేజిక్

'అమెరికన్' మేజిక్

అమెరికన్ మేజిక్ అగ్రరాజ్యం ఆర్థిక పునరుద్ధరణకు బాగా తోడ్పడుతుందని వారెన్ బఫెట్ అన్నారు. 'అమెరికన్' మేజిక్ ఎప్పుడూ ప్రబలంగా ఉంటుందని చెప్పారు. గతంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కానీ అమెరికన్ మిరాకిల్స్, అమెరికా మేజిక్ ప్రబలంగా ఉంటుందని, అది మళ్లీ బలంగా లేస్తుందన్నారు. కాగా, బెర్కషైర్ హాత్‌వే తొలి క్వార్టర్ జనవరి-మార్చిలో 50 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. గత నెలలో మేజర్ ఎయిర్ లైన్స్‌లో ఉన్న వాటాలను విక్రయించినట్లు బపెట్ చెప్పారు. ఇది పొరపాటు కావొచ్చునని, వీటికి 7 నుండి 8 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే, అంత రాలేదన్నారు.

ప్రస్తుతం కరోనాతో అమెరికా పరిస్థితి ఇదీ

ప్రస్తుతం కరోనాతో అమెరికా పరిస్థితి ఇదీ

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2,44,781 మరణాలు చోటు చేసుకోగా ఇందులో అమెరికావే 67,444 ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకిటంచాయి. ఏప్రిల్ 25వ తేదీ నాటికి 3.84 మిలియన్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోయినట్లుగా ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. 2008-09 తర్వాత అమెరికాకు కూడా ఇది అతిపెద్ద ఆర్థిక సంక్షోభం. అయితే గత చరిత్రను తవ్వి చూస్తే అమెరికా వీటి నుండి బయటపడుతుందని, ఇవేవీ అమెరికాను ఏం చేయలేవని బఫెట్ అభిప్రాయపడ్డారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+