కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం భారత ఆర్థిక వ్యవస్థపై బుధవారం మరోసారి స్పందించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆమె ఆర్థిక బృందాన్ని అసమర్థ వైద్యులుగా పేర్కొన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ చర్చలో భాగంగా మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై కేంద్రంపై నిప్పులు చెరిగారు.

ఐసీయూలో కాదు.. కానీ
భారతీయ సీనియర్ ఆర్థికవేత్త అర్వింద్ సిబ్రమణియన్ మన దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై చిద్దూ స్పందిస్తూ.. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వీల్‌చైర్‌లో కూర్చొని ఐసీయులోకి తీసుకు వెళ్తున్న పేషెంట్ మాదిరిగా ఉందన్నారు. కానీ దీనిని గేటు వద్ద అసమర్థ వైద్యుల బృందం చూసేందుకు అడ్డుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.

అంతా చిందరవందర.. ఐనా బాగుందని ప్రభుత్వం
గత కొన్నాళ్లుగా డిమాండ్ పెరగడం లేదని చిదంబరం గుర్తు చేశారు. నిరుద్యోగ శాతం రోజు రోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రెడిట్ అంతా చిందరవందరగా తయారయిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అంతా బాగానే ఉందని ఇప్పటికీ చెప్పడం విడ్డూరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం నుండి 8 శాతానికి ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు.

సమర్థవంత బృందం అవసరం
ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బ్యాడ్‌గానే ఉందని, కానీ 1991 వంటి పరిస్థితులు లేవని చిద్దూ చెప్పారు. 1997లో ఆసియా ఫైనాన్షియల్ క్రైసిస్, 2013 వంటి పరిస్థితులకు దగ్గరగా ఉందని అభిప్రాయపడ్డారు. నాటిలా పరిస్థితిని చక్కదిద్దేందుకు సమర్థవంతమైన బృందం అవసరమని సూచించారు.

కేంద్రంపై చిద్దూ విమర్శలు
కాగా, ఇటీవల చిదంబరం మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందన్నారు. అన్ని రంగాల్లో వృద్ధి కనిపించడం లేదన్నారు. జీడీపీ రేటు దారుణంగా పడిపోయిందన్నారు. దీనికి నోట్ల రద్దు కూడా కారణమని చెప్పారు. ఐసీయూలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు కేంద్రం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications