Indian Economy: 5 ఏళ్లలో భారత్ అద్భుతాలు.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా.. ఎందుకంటే
Indian Economy: భారత్ ప్రస్తుతం అత్యుత్తమ వృద్ధి బాటలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాల చూపు ఇండియాపై ఉంది. భారత ప్రభుత్వం సైతం అమృత్ కాల్ పేరుతో వేగంగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాని నిర్ణయించింది.

ఆర్థిక వేత్తల మాట..
తిరిగి వేగం పుంజుకునేందుకు భారత ఆర్థిక వ్యవస్థ సిద్ధంగా ఉందని ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ పనగారియా అభిప్రాయపడ్డారు. 2027-28 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ఈయన నీతి అయోగ్ వైస్ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఐదవ అతిపెద్దదిగా ఉందని వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో మూడో స్థానానికి ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.

భారత జీడీపీ..
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5 శాతంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. వృద్ధి అంకెలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచంలోని చాలా ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగ్గా ముందుకు సాగుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా పనగారియా అంచనాల ప్రకారం దేశ ఆర్థిక వృద్ధి 7 శాతంగా ఉంటుందని తెలుస్తోంది. 2003 స్థాయి పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు.

బలమైన బ్యాలెన్స్ షీట్స్..
కొవిడ్ మహమ్మారి సమయంలో చేసిన సంస్కరణలతో పాటు ఆర్థిక వ్యవస్థ బలహీనతలను తొలగించడమే అధిక వృద్ధికి తన అంచనాకు ఆధారమని పనగారియా చెప్పారు. బ్యాంకులతో పాటు కార్పొరేట్ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు చాలా బలంగా ఉన్నాయని అన్నారు.

పెరిగిన దూకుడు..
ఇప్పటికే దూకుడు పెంచిన భారత ఆర్థిక వ్యవస్థ రానున్న సంవత్సరాల్లో ఖచ్చితంగా వేగంగా వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతుంది. అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేందుకు ఆర్థిక వ్యవస్తను మరింతగా తెరిచేందుకు చర్యలు తీసుకుంటే వృద్ధి 8 శాతం వరకు సులభంగా చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications