CPI Inflation: అదుపులో రిటైల్ ద్రవ్యోల్బణం..! మార్చిలో 15 నెలల కనిష్ఠానికి..
CPI Inflation: చాలా కాలంగా దేశంలోని ప్రజలకు భారంగా మారుతూ.. ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంక్‌కు ఛాలెంజ్‌గా నిలిచింది ద్రవ్యోల్బణం. అయితే తాజాగా మార్చి నెల ద్రవ్యోల్బణం వివరాలు త్వరలోనే విడుదల కానున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ వార్తా సంస్థలు నిర్వహించిన పోల్ లో మార్చి నెల రిటైల్ ద్రవ్యోల్బణం తొలిసారిగా ఆర్బీఐ లక్ష్యం అయిన 6 శాతం కంటే తక్కువకు చేరుకుంటుందని తేలింది. ఇందులో పాల్గొన్న ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం మార్చి మాసానికి సీపీఐ ద్రవ్యోల్బణం 5.7 శాతానికి పరిమితం కావచ్చని తెలుస్తోంది. దీనికి ముందు ఫిబ్రవరిలో ఇది 6.44 శాతంగా ఉంది.

2022 ప్రారంభం నుంచి కేవలం రెండు నెలల మినహా ప్రతి నెల 6 శాతం కంటే ఎక్కువగానే నమోదవుతూ వచ్చింది. అయితే ఈ సారి మాత్రం ఇది రిజర్వు బ్యాంక్ టాలరెన్స్ బ్యాండ్ 2-6 శాతం మధ్యలోకి రానుందని తెలుస్తోంది. మార్చి మాసానికి సంబంధించిన గణాంకాలను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 12న విడుదల చేయనుంది.
మార్చి మాసంలో వంట నూనె, కూరగాయలు, గుడ్ల ధరల్లో నియంత్రణతో పాటు గోధుమలు, ఆటా ధరల్లో క్షీణత నేపథ్యంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ఎల్ టి ఫైనాన్స్ తప్ప డజనుకు పైగా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఈ సారి ద్రవ్యోల్బణం 6 శాతానికి కింద నమోదవుతుందని అంచనా వేశారు. మరోవైపు మార్చిలో ప్రకటించిన గ్యాస్ ధరల పెంపు కారణంగా ఇంధన ధరలు మొత్తం ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని భావిస్తున్నారు. గణాంకాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 12న పారిశ్రామికోత్పత్తి సూచిక(IIP) డేటాను కూడా ఏప్రిల్ 12న విడుదల చేయనుంది.


Click it and Unblock the Notifications