Inheritance Tax: దేశంలో నెలకొన్న అసమానతలపై సర్వత్రా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆర్థికవేత్తలు తమ గళం వినిపిస్తున్నారు. ధనికులు మరింత సంపద వెనకేసుకుంటూ ఉండగా.. పేదవారు ఇంకా అలానే ఉంటున్నారని ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి.
భారతదేశ ఆర్థిక అసమానత చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రముఖ ఆర్థికవేత్త థామస్ పికెట్టీ ఆందోళన వెలిబుచ్చారు. ధనవంతులపై వారసత్వపు పన్ను విధించాలని సిఫార్సు చేశారు. 10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులున్న ధనికుల నుంచి 2 శాతం పన్నుతో పాటు 33 శాతం వారసత్వ పన్ను వసూలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇది ఆర్థిక అసమానతలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన రిలీజ్ చేసిన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ నిర్ణయం స్థూల దేశీయోత్పత్తిలో (GDP)లో 2.73 శాతం భారీ ఆదాయాన్ని ప్రభుత్వానికి ఆర్జించగలదని అంచనా వేశారు.
10 కోట్లకు పైగా సంపద ఉన్నవారిపై ప్రతిపాదిత పన్ను విధిస్తే.. చాలా కొద్ది మంది మాత్రమే ప్రభావం చూపుతుందని పికెట్టీ పేర్కొన్నారు. 99.96 శాతం మంది ప్రజలు ఈ రెండు ప్రతిపాదిత పన్నుల బారిన పడరని వెల్లడించారు. ఎందుకంటే 2022-23 నాటికి దేశంలోని ధనవంతుల్లో కేవలం 1 శాతం మంది మాత్రమే మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కలిగి ఉండటమే ఇందుకు కారణమన్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, USAతో సహా అనేక దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ నిష్పత్తి ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications