బ్యాంకింగ్ సంక్షోభం ముగియలేదంటున్న ఆర్థిక వేత్త.. భారత్ పరిస్థితిపై ఏమన్నారంటే..!!
US Banking Crisis: అమెరికాలో బయటపడ్డ బ్యాంకింగ్ సంక్షోభం ఇంకా ముగియలేదని ప్రముఖ ఆర్థిక వేత్త నౌరియన్ రౌబినీ అభిప్రాయపడ్డారు. మరిన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో ఉన్నట్లు తాను గమనించానని పేర్కొన్నారు. డ్యూరేషన్ రిస్క్ వల్ల అమెరికా బ్యాంకులకు ఇటీవల సమస్యలు వచ్చాయని తెలిపారు.
అమెరికాలో మార్కెట్ రిస్క్ నుంచి క్రెడిట్ రిస్క్‌కి వెళ్లబోతున్నామని రౌబినీ తెలిపారు. క్రెడిట్ క్రంచ్ పెరిగేకొద్దీ అమెరికాలో మాంద్యం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. USలో మాంద్యం ఏర్పడిన తర్వాత.. మరిన్ని నాన్-పెర్ఫార్మింగ్ లోన్‌లు(NPLలు) తద్వారా మరిన్ని డిఫాల్ట్‌లు ఉంటాయన్నారు. "టైట్" లేబర్ మార్కెట్ వేతన ద్రవ్యోల్బణం యుఎస్‌లో చాలా ఎక్కువగా ఉందని సూచిస్తుందన్నారు.

US ఫెడరల్ రిజర్వ్ (Fed) తన 2 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని చేరుకోవడానికి వడ్డీ రేట్లను మరింత పెంచాలని ఆర్థికవేత్త అభిప్రాయపడ్డారు. అయితే దీనికోసం ఫెడ్ రేట్లను పెంచుకుంటూ పోతే అమెరికాలో ఆర్థిక మాంద్యం, ఆర్థిక అస్థిరత ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలకు ఖచ్చితంగా ప్రతికూలమైన అంశం.
అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఖచ్చితంగా సానుకూలమైనదని రౌబినీ తెలిపారు. ఈ క్రమంలో భారత ఆర్థిక విధానం మంచిది కావచ్చని అన్నారు. భారత సంభావ్య వృద్ధి రన్ 7 శాతంగా ఉన్నప్పటికీ.. ఆర్థిక సంస్కరణలతో అది పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో స్థిర ఆదాయం, ఈక్విటీలు రెండింటిలోనూ పెట్టుబడులు పెట్టడానికి.. భారత్‌తో పాటు మరికొన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు కూడా మంచి ప్రదేశాలని రౌబినీ సూచించారు.


Click it and Unblock the Notifications