2024 Crisis: కొత్త సంవత్సరంలో కష్టాలు తీరతాయని చాలా మంది భావిస్తున్నప్పటికీ అది అబద్దమేనని తెలుస్తోంది. నూతన ఏడాది 2024 ప్రజల జీవితాల్లో పెద్ద పీడకలగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2024లో అత్యంత ముఖ్యమైన మార్కెట్ క్రాష్ రాబోతోందని ఆర్థికవేత్త హ్యారీ డెంట్ హెచ్చరించారు. ఈ క్రమంలో పెట్టుబడిదారులు తమ ఆర్థిక సలహాదారులను నమ్మటం మానేయాలని కోరారు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత పెరిగిన మార్కెట్లు ప్రస్తుతం ఓవర్ వ్యాల్యుయేషన్లకు చేరుకున్నందున కుప్పకూలతాయని అన్నారు.

అయితే ఈ సారి క్రాష్ 1929-1932 స్థాయికి సమానంగా తీవ్రంగా ఉంటుందని ఎకనమిస్ట్ అంచనా వేశారు. ఈ క్రమంలో S&P 500లో 86% క్రాష్, NASDAQలో 92% క్రాష్, క్రిప్టో మార్కెట్‌లో 96% క్రాష్ నమోదయ్యే అయ్యే అవకాశం ఉందని డెంట్ సూచిస్తున్నారు. ఇలాంటి క్రమంలో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను లాభాల్లో ఉన్నప్పుడే విక్రయించటం వల్ల గణనీయమైన నష్టాలను నివారించవచ్చని సూచించారు. అలాగే భవిష్యత్తులో షేర్ల ధరలు క్షీణించినప్పుడు పెట్టుబడి పెట్టి లాభాలను పొందేందుకు మంచి అవకాశాలను ఇవి అందిస్తాయని సలహా ఇచ్చారు.
ఇటీవల అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వచ్చే ఏడాది వడ్డీ రేట్ల తగ్గింపు ద్వారా ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలను ముగించాలనుకోవటాన్ని డెంట్ తప్పుపట్టారు. దీని కారణంగా తేలికపాటి మాంద్యం అంచనాలకు విరుద్ధంగా.. తీవ్ర ప్రతి ద్రవ్యోల్బణంతో మాంద్యానికి దారితీస్తుందని అన్నారు. వాస్తవానికి ఈ ఆర్థికవేత్త 1989లో జపాన్‌లో జరిగిన "బబుల్ బర్స్ట్", అమెరికా డాట్-కామ్ బబుల్, డోనాల్డ్ ట్రంప్ విజయం వంటి కీలక అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇదే క్రమంలో కొందర ఆర్థిక వ్యూహకర్తలు, గోల్డ్‌మన్ సాచ్స్ వంటి పెట్టుబడి సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications