భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (జనవరి 29) పార్లమెంటులో ఎకనామిక్ సర్వే(Economic survey)ను విడుదల చేశారు. దీని ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో (FY27) భారతదేశపు ఎకానమీ 6.8 శాతం నుండి 7.2 శాతం మధ్య వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం స్థిరంగా దూసుకుపోతుండటం విశేషం. మన దేశ సంభావ్య వృద్ధి రేటు (Potential Growth) సుమారు 7 శాతంగా ఉంటుందని సర్వే పేర్కొంది.

దేశీయ డిమాండ్.. వృద్ధికి వెన్నెముక
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, భారతదేశం యొక్క అంతర్గత బలాలు ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం (Rural Consumption) పెరగడం, వ్యవసాయ రంగం మెరుగైన ప్రదర్శన కనబరచడం వృద్ధికి ప్రధాన కారణాలుగా మారాయి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ప్రభుత్వం చేపట్టిన పన్ను హేతుబద్ధీకరణ (Tax Rationalisation) చర్యల వల్ల సామాన్యుడి చేతిలో ఖర్చు పెట్టడానికి ఎక్కువ డబ్బులు మిగులుతున్నాయని, ఇది దేశీయ మార్కెట్లో వస్తువుల డిమాండ్ పెరగడానికి దోహదపడిందని సర్వే (Economic survey) విశ్లేషించింది.
తక్కువ ద్రవ్యోల్బణం - స్థిరమైన ఉపాధి
భారత ఎకానమీ (indian economy) ప్రస్తుతం అత్యంత సానుకూల పరిస్థితుల్లో ఉందని సర్వే వెల్లడించింది. తక్కువ ద్రవ్యోల్బణం, స్థిరమైన ఉపాధి అవకాశాలు , పెరుగుతున్న కొనుగోలు శక్తి వల్ల వినియోగం అన్ని రంగాల్లో విస్తృతంగా సాగుతోంది. గ్లోబల్ షాక్‌లు లేదా అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకోగలిగేంత పటిష్టమైన బఫర్స్ (Bufffers) భారత్ వద్ద ఉన్నాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల విదేశీ పెట్టుబడులు కూడా ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొంది.
సవాళ్లు , భవిష్యత్తు అంచనాలు
వృద్ధి రేటు బాగున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ట్రేడ్ ఫ్రాగ్మెంటేషన్, ఆర్థిక రంగంలో నెలకొన్న సున్నితమైన పరిస్థితులపై సర్వే హెచ్చరించింది. గ్లోబల్ మార్కెట్లలో వచ్చే మార్పులు మనపై కొంత ఆలస్యంగా ప్రభావం చూపే అవకాశం ఉందని, కాబట్టి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్యకాలికంగా చూస్తే.. భారతదేశం యొక్క వృద్ధి పథం చాలా బలంగా ఉందని, ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు , స్థిరమైన స్థూల ఆర్థిక విధానాలు మన దేశాన్ని ప్రపంచ ఆర్థిక పటంలో అగ్రస్థానంలో నిలుపుతాయని ఎకనామిక్ సర్వే (Economic survey) ఆశాభావం వ్యక్తం చేసింది.
బడ్జెట్ 2026 కు అసలైన 'రిపోర్ట్ కార్డ్'
కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (జనవరి 29) పార్లమెంటులో ఈ ఎకనామిక్ సర్వేను సమర్పించారు. ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించిన ఈ కీలక పత్రం, ప్రభుత్వ ఆర్థిక పనితీరుకు ఒక 'రిపోర్ట్ కార్డ్' వంటిది. దీని ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ 6.8% నుండి 7.2% వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేయడమే కాకుండా దేశ సంభావ్య వృద్ధి రేటును 7%గా పేర్కొన్నారు. గత ఏడాది సర్వేలో FY26 కోసం రియల్ జీడీపీ వృద్ధిని 6.3-6.8%గా అంచనా వేయగా.. ఇప్పుడు అది మరింత మెరుగుపడటం విశేషం. అదేవిధంగా ఈ ఏడాది ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యమైన 4%కి అనుగుణంగానే ఉంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇది సామాన్యుడికి పెద్ద ఊరటనిచ్చే అంశం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications