కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ఇది వందేళ్లలో చూడని అతిపెద్ద సంక్షోభమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్బీఐ బ్యాంకింగ్, ఎకనమిక్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడారు. ఆర్థిక స్థిరత్వానికి చర్యలు చేపట్టామన్నారు. ఉపాధి, ఇతర రంగాలపై కరోనా మహమ్మారి ప్రభావం చాలా తీవ్రంగా ఉందన్నారు.
ప్రస్తుతం తమ తొలి ప్రాధాన్యత ఆర్థిక వృద్ధి అని దాస్ చెప్పారు. ఇది మనకు అతిపెద్ద సవాల్ అన్నారు. ప్రతి బ్యాంకు కూడా కోవిడ్ స్ట్రెస్ టెస్ట్ చేపట్టాలని కోరినట్లు తెలిపారు. వందేళ్లలో ఇది దారుణ సంక్షోభం అన్నారు. ఆర్థిక వ్యవస్థను పరిరక్షించేందుకు ఆర్బీఐ కీలకమైన, చారిత్రాత్మకమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఆర్బీఐ తీసుకున్న పాలసీచర్యలు ఫలితం ఇస్తున్నాయన్నారు.

గతంలో మందగనం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు అండగా ఉండేందుకు ఫిబ్రవరి 2019 నుండి ఆర్బీఐ 250 బేసిస్ పాయింట్ల మేరకు రెపో రేటు తగ్గించిందని గుర్తు చేశారు. కరోనా నేపథ్యంలో ఈ ఫిబ్రవరి నుండి ఆర్బీఐ రూ.9.57 లక్షల కోట్ల లిక్విడిటీ చర్యలు ప్రకటించిందన్నారు. ఇది జీడీపీలో 4.5 శాతం అన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications