Flipkart News: దేశంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా ఫ్లిప్‌కార్ట్ కొనసాగుతోంది. ఈ స్టార్టప్ కంపెనీ వాల్‌మార్ట్ యాజమాన్యం కింద పనిచేస్తోంది. ప్రస్తుతం సంస్థ తన ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించటంతో ఉద్యోగుల్లో భయాలు మెుదలయ్యాయి.
ఒకపక్క ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం వంటి అనేక అంశాలు తమపై ప్రభావం చూపుతున్న తరుణంలో.. యూఎస్, భారత ప్రజలు ఖర్చులను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలు సైతం లేఆఫ్ సీజన్లు ఇంకా ముగియలేదని సూచిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లోని అనేక అంశాలు వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వేళ డిజటల్ సర్వీస్, ట్రేడింగ్ కంపెనీలు ప్రభావితం అవుతున్నాయి. ఇదే క్రమంలో స్టార్టప్ కంపెనీలు ఫండింగ్ వింటర్ వల్ల గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఇదే సమయంలో కంపెనీలు ఖర్చుల మదింపుకు AI వినియోగాన్ని ఆయుధంగా ఉపయోగించాలని చూస్తున్నాయి. ప్రస్తుతం లేఆఫ్ నోటీసులు అందుకుంటున్న అనేక మంది ఇలాంటి కారణాలతో ప్రభావితం అవుతున్నవారే. ఇలాంటి పరిస్థితుల్లో వాల్‌మార్ట్-నియంత్రిత ఫ్లిప్‌కార్ట్ తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 5-7 శాతం మందిని తొలగించే ప్రణాళికను ప్రారంభించింది. దీనిని మార్చి-ఏప్రిల్ మధ్య కాలానికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా గత 2 ఏళ్లుగా తొలగింపులను నిర్వహిస్తోంది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ వాల్‌మార్ట్ నుంచి దాదాపు 1 బిలియన్ డాలర్ల నిధులను సేకరించే ప్రక్రియలో ఉంది. ఒకవేళ ఇది విజవంతంగా పూర్తైతే తొలగింపుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. సుమారు 22,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీ తాజా రిట్రెంచ్‌మెంట్‌లో 1500 మందిని తొలగించే అవకాశం ఉందని అంచనా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఫ్లిప్‌కార్ట్ లే ఆఫ్ తర్వాత ఈ రంగంలోని ఇతర ఈకామర్స్ దిగ్గజాలు సైతం ఉద్యోగులను లేఆఫ్ చేయటం ప్రారంభిస్తాయని సమాచారం.


Click it and Unblock the Notifications