Meesho News: తొలిసారిగా లాభాల్లోకి ఈ-కామర్స్ స్టార్టప్ మీషో.. ఐపీవోపై దృష్టి..
Meesho: ఇటీవలి కాలంలో స్టార్టప్ కంపెనీలు తమ పనితీరును మెరుగుపరుచుకుని ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపుతున్నాయి. తొలిసారిగా కంపెనీలు లాభాలను నమోదు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి.
మెున్న జొమాటో నేడు మీషో. అవును ఈ-కామర్స్ వ్యాపారంలో ఉన్న స్టార్టప్ కంపెనీ మీషో తొలిసారిగా జూన్ త్రైమాసికానికి లాభాన్ని నమోదు చేసింది. రానున్న 12-18 నెలల కాలంలో స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోగా అడుగుపెట్టాలని చూస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడిన కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ కంపెనీని IIT గ్రాడ్యుయేట్లు విదిత్ ఆత్రే, సంజీవ్ బర్న్‌వాల్ స్థాపించారు. గడచిన 12 నెలల్లో ఏకంగా 1 బిలియన్ ఆర్డర్ల మార్కును చేరుకున్నారు.

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ మార్కెట్‌లో అమెజాన్, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ వంటి అమెరికా దిగ్గజ సంస్థలతో మీషో పోటీపడుతోంది. ఇది బట్టలు, బ్యూటీ ప్రొడక్ట్స్ వంటి అన్ బ్రాండెడ్ ఉత్పత్తులతో చిన్న పట్టణాలు, నగరాలను లక్ష్యంగా చేసుకుని వ్యాపారాన్ని సాగిస్తోంది. ఈ స్టార్టప్ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు ఉన్న కంపెనీ. 2015లో స్థాపించబడిన నాటి నుంచి స్టార్టప్ నష్టాలను నమోదు చేసింది. అయితే తాజాగా జూన్ త్రైమాసికంలో లాభదాయకమైనదిగా మారింది.
జనవరి-జూన్ మధ్యకాలంలో కంపెనీ ఆదాయం 400 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. అలాగే సంవత్సరం చివరి నాటికి ఇది 800 మిలియన్ డాలర్లను దాటుతుందని కంపెనీ అంచనా వేస్తోందని ఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ధీరేష్ బన్సాల్ తెలిపారు.
ఇది నామమాత్రపు సంఖ్య అయినప్పటికీ తాము రానున్న కాలంలో లాభదాయకత పథాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కంపెనీ వృద్ధి, లాభదాయకతలను పరిగణలోకి తీసుకుని ఐపీవో ప్రణాళిక చేయబడినట్లు బన్సల్ తెలిపారు. ప్రస్తుతం స్టార్టప్ కంపెనీలు ఫండింగ్ వింటర్, టెక్ మార్కెట్లో అస్థిరత కొనసాగుతున్న తరుణంలో మీషో ఈ విజయం సాధించింది.


Click it and Unblock the Notifications