Flipkart Loan: ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. 30 సెకన్లలో లోన్.. పూర్తి వివరాలు
Flipkart Loan: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు పర్సనల్ లోన్స్ అందించేందుకు సిద్ధమైంది. తనకున్న 4.5 కోట్ల వినియోగదారులకు అదనపు సౌలభ్యం, మెరుగైన ప్రయోజనాలను అందించాలని నిర్ణయించింది.
లోన్ ఫెసిలిటీని అందించటం కోసం అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన పర్సనల్ లోన్ సర్వీస్ అత్యంత సరసమైన రుణ ఎంపికలను అందిస్తుంది. అలాగే గరిష్ఠంగా రూ.5 లక్షల రుణాన్ని అందిస్తోంది. వినియోగదారులు 6-36 నెలల మధ్య రీపేమెంట్ టెన్యూర్ ఆఫర్ చేస్తోంది.

ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో వ్యూహాత్మక సహకారం ద్వారా బై నౌ పే లేటర్(BNPL), ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (EMI), కో -బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లు వంటివి అందించినట్లు ఫ్లిప్‌కార్ట్‌లోని ఫిన్‌టెక్, పేమెంట్స్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనెజా వెల్లడించారు.తాజాగా తాము యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో పర్సనల్ లోన్స్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని అన్నారు. కస్టమర్లకు అవసరమైనప్పుడు లిక్విడిటీ మంజూరు చేయటం ద్వారా కొలుగోలు శక్తిని మెరుగుపరచటం తమ లక్ష్యమని ధీరజ్ పేర్కొన్నారు.
కస్టమర్లు తమ లోన్ ఆమోద ప్రక్రియను కేవలం 30 సెకన్లలో పూర్తి చేసుకోవచ్చని ఫిప్‌కార్డ్ వెల్లడించింది. రుణ దరఖాస్తుకు తప్పనిసరిగా పాన్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ, జాబ్ వంటి ప్రాథమిక సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలను అందించిన తర్వాత.. యాక్సిస్ బ్యాంక్ వివరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న రుణ పరిమితిని ఆమోదిస్తుంది. రుణాన్ని పొందేటప్పుడు రీపేమెంట్ కాలాన్ని, పద్ధతిని ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications