అవసరమే ఏ వ్యాపారానికైనా గుండెకాయ. అలాంటి అవసరం కోసమే కంపెనీలన్నీ కాచుకుని కూర్చుంటాయి. మార్కెట్‌లో అవసరం ఏర్పడగానే దాన్ని క్యాష్ చేసుకునేందుకే పెద్ద కంపెనీలు మొదలు చిన్న కంపెనీల వరకు ప్రయత్నిస్తుంటాయి.
అలాంటి అవసరం ఒకటి ఇప్పుడు కంపెనీల పాలిట పెద్ద వరంగా మారింది. అవును, ఇప్పుడున్న అవసరం 'ఫేస్ మాస్క్లులు'. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ ఫేస్ మాస్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
దీంతో ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు మొదలుకొని రిటైల్ దిగ్గజాలైన రిలయన్స్, గ్రోఫర్స్, మింత్రా, బిగ్‌బాస్కెట్ వంటి కంపెనీల దృష్టికూడా ఇప్పుడు ఈ ఫేస్ మాస్కులపై పడింది. వీటి అమ్మకాల్లోకి ఈ పెద్ద కంపెనీలు కూడా దిగాయి.

ఫేస్ మాస్కులకు పెరిగిన డిమాండ్...
కరోనా వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోన్న నేపథ్యంలో దాని బారినుంచి తమను తాము కాపాడుకోవాలన్న స్పృహతో ప్రజలంతా ఫేస్ మాస్కులు కొనుగోలు చేసి ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా, చండీగఢ్‌లో ప్రజలంతా ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. దీంతో డిమాండ్ విపరీతంగా పెరిగి వీటికి ఆయా రాష్ట్రాల్లో తీవ్ర కొరత ఏర్పడింది.

అప్పారెల్ కంపెనీలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు...
డిమాండ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఫేస్ మాస్కుల ఉత్పత్తిని కూడా పెంచాలంటూ అప్పారెల్ బ్రాండ్లను, సరఫరాదారులను ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు కోరుతున్నాయి. దీంతో ఆయా అప్పారెల్ కంపెనీలు ప్రస్తుతం ఫేస్ మాస్కుల తయారీపై దృష్టిసారించి, పెద్ద ఎత్తున వస్తోన్న ఆర్డర్లు మేరకు వాటిని సరఫరా చేసే పనిలో పడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా తమ యూనిట్లను క్లోజ్ చేసిన పలు అప్పారెల్ కంపెనీలు ప్రస్తుతం వాటిని తెరుస్తున్నాయి. గత వారం నుంచి తిరుపూర్ ఈ ఫేస్ మాస్కుల తయారీ కేంద్రంగా మారింది.

ఫేస్ మాస్కుల డెలివరీలో ‘మింత్రా'...
లాక్‌డౌన్ కారణంగా ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన అపారెల్ కంపెనీ ‘మింత్రా' తన సర్వీసులను రద్దు చేసింది. అయితే ఫేస్ మాస్కులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ వారం నుంచి వాటిని డెలివరీ చేయడం ప్రారంభించింది. అంతేకాదు, మరిన్ని ఫేస్ మాస్కుల సరఫరా కోసం టాప్ బ్రాండ్లతో చర్చిస్తోంది. ఈ విషయాన్ని మింత్రా సీఈవో అమర్ వెల్లడించారు.

రంగంలోకి గ్రోఫర్స్, బిగ్‌బాస్కెట్, రిలయన్స్ రిటైల్...
రిటైల్ సంస్థ గ్రోఫర్స్ కూడా ఈ ఫేస్ మాస్కుల విక్రయంలోకి దిగింది. మరోవైపు రిలయన్స్ రిటైల్ కూడా వీటిని అమ్మేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. బిగ్‌బాస్కెట్ కూడా తన ప్లాట్‌ఫామ్‌పై డిస్పోజబుల్ యాంటీ పొల్యుషన్ మాస్కులను ప్రవేశపెడుతోంది.

కోట్ల సంఖ్యలో మాస్కుల విక్రయాలు...
కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో గత నెల రోజులుగా మన దేశంలో ఫేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్స్, టాయిలెట్ క్లీనర్ వంటి హైజీన్ ఉత్పత్తుల విక్రయాలు ఊపందుకున్నట్లు మార్కెట్ రీసెర్చర్ నీల్సన్ రిపోర్ట్ చేసింది. రాబోయే మరికొన్ని రోజుల్లో 500-600 కోట్ల ఫేస్ మాస్కులు అమ్ముడుపోయే అవకాశాలున్నట్లు డెనిమ్ కన్సల్టెంట్ సందీప్ అగర్వాల్ పేర్కొన్నారు.

ప్రభావం తగ్గినా, ముందు జాగ్రత్తగా...
రాబోయే రోజుల్లో ఫేస్ మాస్కుల వ్యాపారంలోకి మరిన్ని కంపెనీలు కూడా దిగే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తోన్న కరోనా వైరస్ కట్టడికి అవసరమైన వ్యాక్సిన్ తయారీకి ఇంకా ఎన్ని నెలల పడుతుందో తెలియదు. ఒకవేళ కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టినా రాబోయే కొన్ని నెలల పాటు ప్రజలంతా ఈ ఫేస్ మాస్కులు ధరించాల్సిన అవసరం ఏర్పడవచ్చు.

చాలా కంపెనీల కోర్ ప్రొడక్ట్ ఇదే..
ప్రస్తుతం ఈ ఫేస్ మాస్కుల తయారీ, అమ్మకాలకు డిమాండ్ బాగా ఉండడంతో క్రమక్రమంగా పదుల సంఖ్యలో కంపెనీలు ఈ వ్యాపారంలోకి దిగుతున్నాయి. ఇప్పుడు చాలా కంపెనీల కోర్ ప్రొడక్ట్ కూడా ఇదేనంటూ తయారీ రంగ నిపుణులు కూడా చెబుతున్నారు. మొత్తంమీద టెక్స్ట్ టైల్ ఇండస్ట్రీ నష్టాలను ఈ ఫేస్ మాస్కులు కొంతమేర తగ్గించనున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications