Ecom Express IPO: ఇటీవలి కాలంలో ఐపీవోల మార్కెట్లో వస్తున్న కంపెనీల సంఖ్య కొంత నెమ్మదించింది. దీంతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా కొన్ని వారాలుగా నిరంతరం నష్టాలను చూడటంతో పెట్టుబడిదారులు మార్కెట్లకు కొంత దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఐపీవో తన ప్లాన్ వెనక్కి తీసుకుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడింగ్ కంపెనీ ఈకామ్ ఎక్స్‌ప్రెస్ కంపెనీ ఐపీవో గురించే. త్వరలోనే దేశీయ స్టాక్ మార్కెట్లోకి తన ఐపీవోను తీసుకురావాలని ప్లాన్ చేసిన కంపెనీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. కంపెనీ తన ఐపీవో ప్రణాళికను వెనక్కి తీసుకోవటంతో పాటు దాదాపు కంపెనీ నుంచి 500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కంపెనీ ఐపీవో కోసం దరఖాస్తుకు మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ డిసెంబర్ 2024లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ తన ఖర్చులను తగ్గించుకోవటానికి ముఖ్య ప్రాధాన్యతను ఇవ్వటంతోనే ఐపీవోకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. కానీ కంపెనీ ఇందులో భాగంగా దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తోందని వెల్లడైంది. ఈ క్రమంలోనే కంపెనీ హెచ్‌ఆర్ ఉద్యోగులకు ఫోన్ చేసి రాజీనామా చేయమని కోరినట్లు తేలింది. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ తన ఐపీవో ప్రణాళికలో భాగంగా మూలధన అవసరాల కోసం దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2,600 కోట్లను సమీకరించేందుకు ఐపీవోను ఫ్లోట్ చేసే ప్రణాళికతో ముందుకు వచ్చింది. వాస్తవానికి నష్టాల్లో ఉన్న కంపెనీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం గమనార్హం.
కంపెనీ వ్యాపారం..
ఈకామ్ ఎక్స్‌ప్రెస్ దేశంలో 3,000కి పైగా పిన్ కోడ్‌లను, 1,000 డెలివరీ సెంటర్లను మూసివేసిన సంగతి తెలిసిందే. అలాగే కంపెనీ 20 ప్రధాన కేంద్రాల మూసివేత ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 27,000 కంటే ఎక్కువ పిన్ కోడ్‌లకు డెలివరీలు చేయగలమని కంపెనీ చెబుతోంది. దీని ద్వారా జనాభాలో దాదాపు 97 శాతం మందికి సేవలను అందిస్తున్నట్లు ఈ లాజిస్టిక్స్ కంపెనీ చెబుతోంది. దేశంలో ఈకామర్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ కంపెనీ సేవలకు డిమాండ్ పెరిగింది.
వాస్తవానికి కంపెనీ 2022లో కూడా రూ.4860 కోట్ల ఐపీవోను ప్రారంభించటానికి సెబీ నుంచి అనుమతి పొందింది. కానీ అప్పట్లో అది నిలిపివేయబడింది. కానీ ఇప్పుడు రూ.2600 కోట్ల ఐపీవోలో రూ.1284.5 కోట్లకు ఆఫర్ ఫర్ సేల్ కాగా మిగిలిన దానిని తాజా ఈక్విటీ ఇష్యూ ద్వారా కంపెనీ పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే అనూహ్యంగా కంపెనీ మళ్లీ తన ఐపీవో ప్రణాళికలను వెనక్కి తీసుకుంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications