Penny Stock: విదేశీ ఇన్వెస్టర్లు మెచ్చిన స్టాక్.. తక్కువ రేటులో తుఫాను రాబడి..
Stock Ideas: మార్కెట్ల ర్యాలీ ఉన్నా లేకున్నా చాలా మంది ఇన్వెస్టర్లు ప్రధానంగా వెతుకుతూ ఉండేది పెన్నీ స్టాక్స్ గురించే. తక్కువ రేటులో దొరికే షేర్లంటే మనకే కాదు విదేశీ ఇన్వెస్టర్లకు సైతం మక్కువ ఎక్కువని ఈ స్టాక్ చూస్తే తెలుస్తుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది లాజిస్టిక్స్ సొల్యూషన్స్ వ్యాపారంలో ఉన్న ఈస్ట్ వెస్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీ గురించే. వాస్తవానికి ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం పెన్నీ స్టాక్స్‌లో పెరుగుదల నమోదైన వాటిలో ఇది కూడా నిలిచింది. ఈ క్రమంలో స్టాక్ 5 శాతం పెరిగి రూ.8.78 వద్దకు చేరుకుంది. దీనికి ముందు డిసెంబర్ 18న స్టాక్ 52 వారాల గరిష్ఠమైన రూ.11.47కి చేరింది. గతేడాది మార్చి 2023లో 52 వారాల కనిష్ఠ ధర రూ.3.83ను తాకింది.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈ స్టాక్‌పై బెట్టింగ్ వేస్తున్నారు. మారిషస్‌కు చెందిన ఎఫ్‌ఐఐ ఎగ్ డైనమిక్స్ ఫండ్ కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉంది. ఈ స్మాల్ క్యాప్ స్టాక్‌లో ఎఫ్‌ఐఐకి 6.78 శాతం వాటా ఉంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఈస్ట్ వెస్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ షేర్ హోల్డింగ్ పరిశీలిస్తే ఫండ్ 86.50 లక్షల షేర్లను కలిగి ఉంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 61.28 శాతం ఉండగా పబ్లిక్ షేర్ హోల్డింగ్ 38.72 శాతంగా కొనసాగుతోంది. గడచిన ఆరు నెలల కాలంలో కంపెనీ ఇన్వెస్టర్లకు ఏకంగా 85 శాతం రాబడిని అందించింది.
నెల రోజుల కాలంలో కంపెనీ 30 శాతం మేర రాబడిని అందించింది. ఈస్ట్ వెస్ట్ హోల్డింగ్స్ ఇటీవలే బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌తో తన CHA సేవా ఒప్పందాన్ని పునరుద్ధరించింది.ఈస్ట్ వెస్ట్ హోల్డింగ్స్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు కస్టమ్ హౌస్ ఏజెంట్ సేవలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications