EaseMyTrip: వందల ఏళ్లుగా భారతీయ హిందువులు అయోధ్య గురించి ఎన్నో కలలు కన్నారు. గతనెల అవికాస్తా నిజమయ్యాయి. దీంతో సంబరాల నడుమ శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు రామజన్మభూమి ఓ ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగులీనుతోంది. ఇక్కడికి వచ్చే యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తూ తమ వ్యాపారలను పెంచుకునేందుకు పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి.
అయోధ్యలో 150 గదుల రాడిసన్ బ్లూ హోటల్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఈజ్‌మైట్రిప్ ప్రకటించింది. జీవని గ్రూప్‌తో సహా ర్యాడిసన్ హోటల్ గ్రూప్‌తో ఇందుకోసం వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు నిర్ధారించింది. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్, రాడిసన్ బ్లూ హోటల్ 2027లో అయోధ్యలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

ట్రావెల్ బుకింగ్ సైట్ ఈజ్‌మైట్రిప్ ప్రకారం.. అయోధ్యలోని శ్రీరామ మందిరం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే హోటల్ రూపుదిద్దుకోనుంది. గత నెల జనవరి 22న జరిగిన రామలల్ల ప్రాణప్రతిష్ఠ అనంతరం రోజూ వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అయోధ్య అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో హోటల్ రంగం ఈ నగరంలో వ్యాపారానికి ఆసక్తి చూపిస్తోంది.
'జీవని, ర్యాడిసన్, ఈజ్‌మైట్రిప్‌ల మధ్య సహకారం నగరంలో ఆతిథ్య రంగం అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. భక్తులకు అత్యుత్తమ పర్యాటక అనుభూతిని అందిస్తుంది. ఓ గ్రూప్ గా కలవడం ద్వారా ఆతిథ్య పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పడం సాధ్యమవుతుంది. అయోధ్యలో కొత్త మైలురాయిని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాము' అని ఈజ్‌మైట్రిప్ CEO నిశాంత్ పిట్టి తెలిపారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications