మన దేశంలో అందరూ డిగ్రీల కోసం, పెద్ద ఉద్యోగాలకు పరితపిస్తూ పరుగెడుతుంటాము. ఎవరి తల్లిదండ్రులైనా ఒక ఇంజనీర్, డాక్టర్, లేదా ఎంబీఏ చేయండి అని చెప్తూ ఉంటారు. కాని, మహారాష్ట్రలో ఒక యువకుడు ఊహించని దిశగా, దేశమంతా ఆశ్చర్యపోయేలా తన జీవితాన్ని మార్చుకున్నాడు.

అతను ఒక డాగ్ వాకర్ అవును, పెంపుడు కుక్కలను రోజు బయటకి నడిపించుకుని తీసుకెళ్లే పని. ఈరోజుల్లో కొత్తగా మొదలైన ఈ "pet walking" అనేది సరదాగా చేసే చిన్న పని అనిపించొచ్చు. కానీ అతడు నెలకు ఏకంగా రూ. 4.5 లక్షలు దాని ద్వారా సంపాదిస్తున్నాడు.
అతను చేస్తున్న పని చాలా మందికి చిన్నచూపుగా కనిపించినా అతను మాత్రం రోజూ 38 కుక్కలను నడిపిస్తాడు. ఒక్కో పెంపుడు జంతువుకి రోజుకి రెండు సార్లు వాకింగ్ చెప్పిస్తాడు. ఒక్కో కుక్కకు నెలకు కనీసం రూ. 15,000 తీసుకుంటాడు. మొత్తంగా కలిపితే నెలకు దాదాపు రూ 4.5 లక్షలు. ఇది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి, డాక్టరకి వచ్చే దానికంటే ఎక్కువ ఆదాయం.
ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే అతడి తమ్ముడు MBA బయట విదేశాల్లో చేసి ఇప్పుడు ఒక కంపెనీలో మంచి హోదాలో ఉంది నెలకు రూ. 70,000 సంపాదిస్తున్నాడు. కానీ 'డిగ్రీ' కన్నా పెంపుడు జంతువుల మీద సంపాదిస్తున్న అన్నయ్యకు మాత్రం ఆరు రెట్లు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి.
బయట నుంచి చూస్తే "మీరు డాగ్ వాకర్ ఏంటి?" అని చిన్నచూపు వచ్చే అవకాశముంది. కాని మహా నగరాల్లో పెట్ కేర్ అభిరుచి రోజురోజుకీ మారుతోంది. 2026 నాటికి భారత పెట్ కేర్ మార్కెట్ విలువ రూ. 7,500 కోట్లు దాటుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేసారు. హైసొసైటీ కాలనీల్లో పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలకు ప్రీమియం సేవల కోసం డబ్బు ఇవ్వడాన్ని ఎప్పుడూ రాజీపడరు. అక్కడే అతనికి డిమాండ్ పెరిగింది.
సంప్రదాయ ఉద్యోగాల కంటే స్కిల్, అనుభవానికి డిమాండ్ పెరుగుతోంది. మనం చేసే పనిలో అంకితభావం, ప్రేమ ఉంటే అది ఏ రంగమైనా ఉన్నతస్థాయికి తీసుకెళ్ళుతుంది. తక్కువగా విలువిచ్చే పనిలో కూడా, మార్కెట్ అవసరాన్ని గమనించి, కస్టమర్లకు విలువ కల్పిస్తే అదే పెద్ద ఆదాయంగా చేసుకోవచ్చు.
మెట్రో నగరాల్లో ఇప్పుడు డాగ్ వాకర్లకు, పెట్ సిట్టర్లకు నెలకు లక్షల్లోనే కాదు, ఆపైకి కూడా ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. రోజుకు పది, ఇరవై కుక్కలను తాను చూసుకోవాలనుకుంటే షిఫ్ట్ వరుస, ప్రీమియం క్లయింట్స్, వ్యక్తిగతీకరించిన సర్వీసులతో తను చూసుకుంటే అది ఒక పవర్‌ఫుల్ కెరీర్ అవుతుంది. అయితే, ఈ రంగంలో స్థిరంగా నిలబడాలంటే నిజాయితీ, డెదికేషన్, డిసిప్లిన్ ఉంటే చాలు.
పెట్ వాకింగ్ వెనుక ఉన్న కష్టాలు
పెట్ వాకింగ్ అనేది చూసేటప్పుడు సరదాగా అనిపించినా, దాని వెనుక గల కృషి అంత తేలికైనది కాదు. ఈ పని చేసే వారు ఉదయాన్నే లేచి వారి పని ప్రారంభించాల్సి వస్తుంది. వేసవి కాలంలో ఎండలను తట్టుకోవాలి, వర్షంలో తడవాలి, చలికాలంలో కూడా బయట తిరగాలి. ఒక్కో కుక్కకు ఒక్కో స్వభావం, అలవాట్లు ఉంటాయి. కొన్ని మితిమీరిన ఉత్సాహంతో ఉంటే, మరికొన్ని భయపడుతూ నడుస్తుంటాయి. వీటన్నింటినీ ఓర్పుతో, శిక్షణతో, ప్రేమతో నడిపించాలి అదే అసలు సవాలు.
పెంపుడు జంతువులపై మార్కెట్ ఎలా ఏర్పడింది
ఇప్పటి నగరాలలో పెంపుడు జంతువుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. డ్యూయల్ ఆదాయ కుటుంబాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో, పెంపుడు జంతువులను ఇంట్లో ఒంటరిగా వదిలేయడం అవసరంగా మారింది. దీనివల్ల డాగ్ వాకింగ్, పెట్ సిట్టింగ్ వంటి సేవలకు డిమాండ్ పెరిగింది. అదీ కాకుండా, పెట్ ఫ్రెండ్లీ అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల పెరుగుదల కూడా ఈ సేవలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ మార్పులతో, పెట్ వాకింగ్ ఒక ప్రొఫెషన్ గా ఎదిగే అవకాశం ఏర్పడింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications