ఇప్పుడు ఉద్యోగం లేకుండానే నెలకు స్థిరమైన ఆదాయం పొందాలనుకుంటున్నారా? అయితే LIC ప్రారంభించిన బీమా సఖి యోజన మీ కోసం ప్రత్యేకంగా వచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలు LIC ఏజెంట్లుగా పనిచేసి నెలకు రూ. 7,000 వరకు సంపాదించవచ్చు. ప్రత్యేక శిక్షణ, ప్రోత్సాహకాలు, మరియు ఆదరణతో ఈ స్కీం మహిళలను ఆర్థికంగా బలమైనవారిగా మార్చే లక్ష్యంతో ముందుకొస్తోంది.

LIC బీమా సఖి అంటే ఏంటి?
బీమా సఖి అనేది మహిళల కోసం తయారైన ప్రత్యేక పథకం. ఇందులో మహిళలు LIC ఏజెంట్లుగా పనిచేసే అవకాశం ఉంటుంది. అవసరమైన శిక్షణ, ప్రచార పత్రాలు, మార్కెటింగ్ మటీరియల్, మరియు ప్రోత్సాహకాలు అందిస్తారు. ఈ స్కీం ద్వారా మహిళలు తమ ప్రాంతంలో బీమా గురించి చెబుతూ ఆదాయం సంపాదించవచ్చు. అంటే, ఇది మహిళలు స్వయం సంపన్నులుగా మారే మంచి అవకాశమన్న మాట.
ఎంత సంపాదించవచ్చు?
ఈ బీమా సఖి స్కీంలో మూడు సంవత్సరాల పాటు నెలనెలా స్టైఫెండ్ అందించే అవకాశం ఉంటుంది. మొదటి సంవత్సరంలో ఎంపికైన మహిళలకు నెలకు రూ.7,000 స్థిరమైన స్టైఫెండ్ లభిస్తుంది. ఇది వారి పనితీరును బట్టి నిర్ణయించబడుతుంది. రెండో సంవత్సరంలో స్టైఫెండ్ తీసుకోవాలంటే, మొదటి సంవత్సరం తీసిన పాలసీలలో కనీసం 65 శాతం ఇప్పటికీ చెల్లుబాటులో ఉండాలి. అలా ఉంటే నెలకు రూ.6,000 స్టైఫెండ్ లభిస్తుంది. అదే విధంగా, మూడో సంవత్సరంలో కూడా పాలసీలు 65 శాతం పైగా చెల్లుబాటులో ఉంటే, నెలకు రూ.5,000 వరకు స్టైఫెండ్ అందే అవకాశం ఉంటుంది. కానీ పాలసీల చెల్లుబాటులో ఉండే శాతం 65% కంటే తక్కువగా ఉంటే, ఆ సంవత్సరానికి స్టైఫెండ్ ఇవ్వబడదు. కనుక పాలసీలను కొనసాగిస్తూ ఉండటం చాలా ముఖ్యం.
ఎవరు అర్హులు?
LIC బీమా సఖి యోజనకు దరఖాస్తు చేయాలనుకునే మహిళలు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. దరఖాస్తు చేసే సమయంలో వారి వయస్సు కనీసం 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. గరిష్ఠంగా 70 సంవత్సరాల వయస్సు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత విషయానికి వస్తే, కనీసం పదోతరగతి (10వ క్లాస్) పాస్ అయ్యి ఉండాలి. ఇవి ఉన్న ప్రతి మహిళకు ఈ పథకంలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ఎవరు దరఖాస్తు చేయలేరు?
ఇప్పటికే LICలో ఏజెంట్‌గా ఉన్న వారు. LIC ఉద్యోగులు లేదా ఏజెంట్ల బంధువులు (భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, మామగారు, అత్తగారు), రిటైర్డ్ LIC ఉద్యోగులు. గతంలో LIC ఏజెంట్‌గా పని చేసి, ప్రస్తుతం నియామకంలో లేని వారు.
LIC బీమా సఖి యోజనకు దరఖాస్తు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా, వయస్సు రుజువుకు ఆధార్, పాన్ కార్డ్ లేదా పదోతరగతి సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్‌ను సెల్ఫ్ అటెస్టెడ్ (స్వయంగా సంతకం చేసిన) కాపీ జత చేయాలి. అలాగే, చిరునామా రుజువు, విద్యార్హత సర్టిఫికేట్ కాపీ కూడా సమర్పించాలి. చివరగా, తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్లు పూర్తిగా ఉంటెనే తప్ప దరఖాస్తు కొనసాగదు.
LIC ప్రత్యేక శిక్షణ, మార్కెటింగ్ మటీరియల్, ప్రమోషన్ సపోర్ట్ అందిస్తుంది. బీమా సఖిగా మీరు విజయవంతంగా పనిచేయడానికి అవసరమైన అన్ని మార్గదర్శకాలు లభిస్తాయి.
ఎలా అప్లై చేయాలి?
ఈ స్కీం గురించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియ కోసం మీ ప్రాంత LIC బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు లేదా అధికారిక LIC పోర్టల్(https://licindia.in)లో చూడవచ్చు.
ఈ యోజన మహిళలకు ఓ మంచి అవకాశంగా నిలుస్తోంది. సేవా మనోభావంతో పని చేస్తూనే, నెలకు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశం కావాలనుకునే గృహిణులు, విద్యార్థినులు, లేదా రెండో ఆదాయం కోరే మహిళలకు ఇది ఓ సులభమైన మార్గం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications